ప్రజా సమస్యలపై కలిసి పని చేద్దాం



ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఎప్పుడూ ఉంటుందని నెల్లూరు నగరమేయర్ రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు బాలాజీ నగర్ లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా ముఖ్య నాయకులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు.

 ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ వామపక్ష పార్టీలు అంటే తనకు ఎంతో గౌరవమని ప్రజా సమస్యలకు సంబంధించి పరిష్కారంలో తన వంతు భాగస్వామ్యం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలతో ఆయన కొన్ని విషయాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా ఏం. మోహన్ రావు, సిఐటియు జిల్లా నేత అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు