అమరావతిలో 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో సుమారు 3500 టన్నుల కంచుతో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  దీనికి సంబంధించిన డిజైన్లను క్యాబినెట్ సబ్‌ కమిటీ పరిశీలించింది.  విగ్రహంతోపాటు స్మృతివనం డిజైన్లను ఖరారు చేయడానికి ప్రభుత్వం సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది.  ఈ ప్రాజెక్టును అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AGICL) పర్యవేక్షించనుంది.