చిన్నారులకు ఎమ్మెల్యే కావ్య ఆశీస్సులు


బిట్రగుంట, రవి కిరణాలు : 
బోగోలు మండల కేంద్రానికి చెందిన ప్రముఖ టీడీపీ నాయకులు బోగిరి ప్రభాకర్, రాజకుమారి దంపతుల పిల్లలు ఆకర్ష్, ఆశ్చర్య మణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులతో కలిసి సందడి చేశారు.

ఎమ్మెల్యే స్వయంగా కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. అనంతరం అక్షింతలు వేసి, వారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, ఉజ్వల భవిష్యత్తు పొందాలని ఆశీర్వదించారు.

కార్యకర్తలు, నాయకుల కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు హాజరవుతున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రాకతో బోగిరి ప్రభాకర్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని చిన్నారులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.