పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్ ప్రజల పాలిట ఓ వరం

 సత్యవేడులో అట్టహాసంగా అన్నాక్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం 


 పేదలకు కూడు గూడు గుడ్డ నినాదంతో ఏర్పడిన టీడీపీ పాలనలోనే పేదల సంక్షేమం రాష్ట్ర ప్రగతి 

పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్ పేద ప్రజల పాలిట ఓ వరమని, దాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం జీవిత ధన్యమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు 

 సత్యవేడులో అట్టహాసంగా అన్నాక్యాంటీన్ ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.. 

పేదలకు కూడు గూడు గుడ్డ కల్పించడమే ఆశయంగా పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ అబివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన టీడీపీ నేతృత్వలోనీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు..

నియోజకవర్గ కేంద్రమైన  సత్యవేడుకి వివిధ ప్రాంతాల నుంచి నుంచి కోర్టు వ్యవహారాలు సబ్ రిజిస్టర్ కార్యాలయo, పోలీస్ స్టేషన్  ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ అవసరాలకు సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకి అయిదు రూపాయలకే భోజనం కల్పించడం కోసం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు తాను కృషి చేశానని కోనేటి ఆదిమూలం అన్నారు