నెల్లూరు: 3వ అంతస్తు నుంచి పడి యువకుడి మృతి
నెల్లూరు: 3వ అంతస్తు నుంచి పడి యువకుడి మృతి
గుంటూరులో ఓ వ్యక్తి 3వ అంతస్తు నుంచి పడి దుర్మరణం చెందాడు. నెల్లూరు(D) కోవూరు(M) ఇనమడుగుకు చెందిన అశోక్ కుమార్ రెడ్డి(29) గుంటూరులోని ముత్యాలరెడ్డి నగర్‌లో ఉంటున్నాడు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు 3వ అంతస్తు నుంచి కింద పడినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.