పాలమూరు: అంబులెన్స్ డ్రైవర్ల నియామకం

పాలమూరు జిల్లాలోని 108, 102 అంబులెన్స్‌లలో డ్రైవర్ పోస్టులకు ఏప్రిల్ 3న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, మూడేళ్ల అనుభవం, బ్యాడ్జి నంబర్ కలిగిన 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులు. ఆసక్తిగలవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు జిల్లా ఆస్పత్రిలోని 108 కార్యాలయానికి రావాలి. వివరాలకు 94912 71103 నంబర్‌ను సంప్రదించగలరు.