తన భర్త పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారుగొల్లపూడి షర్మిల ఆరోపణ
తన భర్త పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు
గొల్లపూడి షర్మిల ఆరోపణ
నెల్లూరు జిల్లా, సెప్టెంబర్ 27, రవి కిరణాలు :
నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం మాజీ అధ్యక్షుడు తన భర్త అయినా శ్రావణ్ కుమార్ పై అధికార పార్టీకి చెందిన వేమిరెడ్డి దంపతుల ఒత్తిడితో పోలీసులు అక్రమ కేసులు వేధిస్తున్నారని శ్రావణ్ కుమార్ భార్య షర్మిల ఆరోపించారు. ఆదివారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన భర్తకు ఒక కేసులో బెయిల్ వచ్చే టైమ్ కి మరో కేసు... ఇలా వరుసగా కాంట్రాక్టర్లను బెదిరించినట్టు కేసులు పెట్టి వేదిస్తున్నారు. తన భర్త ఎ తప్పు చేయక పోయినా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని పేర్కొన్నారు.
బ్రాహ్మణులు భోజనం చేస్తుంటే చూడకూడదు అంటారని అలాంటిది శ్రావణ్ భోజనం చేస్తుంటే మధ్యలోనే ఆపి నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లారని ఇది మహా పాపం అన్నారు. పిల్లోడికి పుట్టు వెంట్రుకలు తీయించాలని అనుకుంటున్న సమయంలో అక్రమంగా అరెస్ట్ చేశారు. తండ్రి లేకుండానే బిడ్డ పుట్టు వెంట్రుకలు తీయించాల్సిన పరిస్థితులు కల్పించారని చెప్పారు. మా బాధ ను వెంకటేశ్వర్ స్వామికి కూడా చెప్పుకున్నామని అన్నారు.
ఇలాంటి కష్టమైన పరిస్థితి ఏ భార్యకు రాకూడదని తన భర్త అరెస్టుకి కారణమైన ప్రతి ఒక్కరికీ బ్రాహ్మణ స్త్రీ ఉసురు ఖచ్చితంగా తగులుతుందన్నారు. తమ పిల్లలు తండ్రి కోసం పరితపిస్తున్నారు. వాళ్ళను చూసైనా నా భర్తను వదిలేయండని అన్నారు. జిల్లా
ఎస్పీ కూడా కూడా ఒక మహిలేనని సాటి మహిళ బాధ చూసైనా నా భర్తను విడుదల చేయాలని కోరుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో శ్రావణ్ తల్లి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.