ఘనంగా స్వర్గీయ ఎన్టీ రామారావు 103వ జయంతి వేడుకలు.

 నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. 

రవికి రణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:- 


మహానటుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103 వ జయంతి సందర్భంగా సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ మన్నారు పోలూరు నందు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.


నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఎన్టీ రామారావు పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, పార్టీ చేపట్టి నెలలలోని అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఎన్టీ రామారావు తర్వాత తెలుగుదేశం పార్టీ కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. పై కార్యక్రమంలో ఏఎంసి  చైర్మన్ ఆకుతోట రమేష్, సుధాకర్ రెడ్డి, పిట్ల సుబ్రహ్మణ్యం, ఏజీ కిషోర్, మోదుగుల కృష్ణయ్య, పామూరు మునిస్వామి, నాప శ్రీనివాసులు, పిచ్చుక శ్రీనివాసులు, బండ్ల యుగంధర్, శేఖర్, శివాలయం బోర్డు మెంబర్ పల్లమాల సుమతి, తదితరులు పాల్గొన్నారు.