శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ఘనంగా మాలాధారణ, కాత్యాయని వ్రతం
నెల్లూరు,రవి కిరణాలు : శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం మాలాధారణ, సాయంత్రం కాత్యాయని వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఉదయం శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షులు పెంచల రెడ్డి ఆధ్వర్యంలో ‘శ్రీ రాజరాజేశ్వరి మాలాధారణ’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు అమ్మవారి భక్తులు నిష్టగా మాలాధారణ చేసి దీక్షను స్వీకరించారు.సాయంత్రం ఆలయంలోని అనివెట్టి మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేశారు. ఈ సందర్భంగా కాత్యాయని వ్రతాన్ని కన్నులపండువగా నిర్వహించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి నూతలపాటి శ్రీధర్ నాయుడు, ఆలయ ఛైర్మన్ శిరీష పర్యవేక్షణలో జరిగిన ఈ ఉత్సవాల్లో ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.