విద్యుత్ సేవలకు ప్రభుత్వం అభినందనలు...
విద్యుత్ సేవలకు ప్రభుత్వం అభినందనలు...
సీఎం.. డిప్యూటీ సీఎం ప్రశంసలు మరింత బాధ్యతను పెంచాయి..
పల్లె పండుగ–3.0 కార్యక్రమానికి నిరంతర విద్యుత్ సరఫరా..
సమన్వయంతో విధులు నిర్వహించిన..
అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు..
జిల్లా పర్యవేక్షక ఇంజనీరు పి.సుధాకర్ వెల్లడి..
నెల్లూరు,రవి కిరణాలు : నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో నిర్వహించిన పల్లె పండుగ–3.0 కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ లు మెరుగైన విద్యుత్తు సేవలు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించడం తమ బాధ్యతను మరింతగా పెంచిందని ఏపీ ఎస్పీడీసీఎల్ నెల్లూరు జిల్లా సూపరిండెంటింగ్ ఇంజనీరు పి సుధాకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం విద్యుత్ అధికారులు.. సిబ్బందితో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పల్లె పండుగ-3.0 కార్యక్రమానికి ఎటువంటి విద్యుత్ అంతరాయం
. ఇతర ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు.
ఈ కార్యక్రమం కోసం అవసరమైన ఏర్పాట్ల నిమిత్తం గత పది రోజులుగా ఆత్మకూరు ప్రాంతంలోనే ఉండి నిరంతరం పర్యవేక్షిస్తూ, విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలెక్టర్ ముందస్తు ఏర్పాట్లు చేసి విధులు నిర్వహించిన ఆత్మకూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్ తోపాటు ఆయన టీమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అదేవిధంగా ఏపీ ఎస్పీడీసీఎల్ తిరుపతి కార్పొరేట్ ఆఫీస్ నుండి నోడల్ ఆఫీసర్‌గా విచ్చేసి కార్యక్రమ ఏర్పాట్లను సమన్వయం చేసిన జగదీశ్ కన్ స్ట్రక్షన్.. ట్రాన్స్ ఫార్మర్స్.. టెక్నికల్ డివిజన్ల విభాగాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు
కే. పరంధామయ్య , లక్ష్మీనారాయణ, షేక్ అల్తాఫ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర అధికారులతోపాటు ఓ అండ్ ఎం సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగా భాగస్వాములైన ప్రతి ఒక్కరి సమిష్టి కృషి, సమన్వయం మరియు అంకితభావాన్ని.. ఈ సందర్భంగా ఎస్.ఈ.. అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సమన్వయంతో ప్రజలకు నిరంతరాయమైన విద్యుత్ సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
.jpeg)
