కావలి చైర్మన్ అభ్యర్థిగా రాజ్ కుమార్ చెరదా?
గుంటుపల్లి అభ్యర్థిత్వం ఖరారయ్యేనా.. సంకేతాలు! టీడీపీ అధినాయక ప్రకటనపై ఆసక్తి!
కావలి, రవి కిరణాలు : కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించనున్నారనే చర్చలో గుంటుపల్లి రాజ్ కుమార్ చెరదా పేరు ప్రధానంగా వినిపిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన అభ్యర్థిత్వం ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశం పట్టణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చైర్మన్ అభ్యర్థిగా రాజ్ కుమార్ చెరదాకు అవకాశం దక్కుతుందా? పార్టీ నాయకత్వం నుంచి ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడే వరకు స్పష్టత వచ్చే అవకాశం లేదు. టీడీపీ నాయకత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
