1వ డివిజన్ కొత్త కాలువ సెంటర్‌లో సెంట్రల్ డివైడర్, లైటింగ్ పనులకు శంకుస్థాపన

నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ కొత్త కాలువ సెంటర్‌లో రూ.45 లక్షల వ్యయంతో చేపట్టనున్న సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, సీనియర్ టీడీపీ నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు.

రూరల్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం

ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామాలు, డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

1వ డివిజన్‌కు రూ.16.90 కోట్ల నిధులు

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 1వ డివిజన్ అభివృద్ధి పనుల కోసం ఇప్పటివరకు రూ.16 కోట్ల 90 లక్షలు కేటాయించినట్లు గిరిధర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

కొత్త కాలువ సెంటర్‌లో చేపట్టనున్న సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులతో ఆ ప్రాంతంలో రహదారి సదుపాయాలు మరింత మెరుగుపడతాయని, ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై పిలుపు

అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే కూటమి అభ్యర్థులకు ఓటు వేసి విజయాన్ని అందించాలని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి కుడుముల చిరంజీవి, కో-క్లస్టర్ ఇన్‌చార్జి తంబి శ్రీనివాసులు, 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు జావిద్, కోడూరుపాడు పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ గంగి జయరామిరెడ్డి, శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఓట్టూరు సురేంద్ర యాదవ్, టీడీపీ నాయకులు ముచ్చకాయల వేణు యాదవ్, కంటేపల్లి సీనయ్య, జబ్బర్, దంతు విజయకుమార్ యాదవ్, సురేష్, గౌస్ తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.