పేదల ఆరోగ్య భద్రతకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా
ఆత్మకూరు నియోజకవర్గంలో రెండేళ్లలో 1,150 కుటుంబాలకు రూ.10.42 కోట్లకు పైగా ఆర్థిక సహాయం నేడు మరో 69 కుటుంబాలకు రూ.63.79 లక్షల చెక్కుల పంపిణీ
నెల్లూరు, రవికిరణాలు : అనారోగ్యంతో బాధపడుతూ ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పేదల ఆరోగ్య భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వైద్య ఖర్చుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఆత్మకూరు పట్టణంలోని అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన బైపాస్ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 1,150 కుటుంబాలకు మొత్తం రూ.10,42,08,879 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. తాజాగా మరో 69 కుటుంబాలకు రూ.63,79,000 విలువైన చెక్కులు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంజూరై అందుబాటులోకి వచ్చాయని, వాటిని లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు వివరించారు.
అనారోగ్యంతో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో వైద్య ఖర్చులు భరించలేక పేద కుటుంబాలు అప్పులపాలవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించే ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. అర్హులైన బాధితులకు అవసరమైన సహాయం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం అందక ఏ కుటుంబమూ ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన వైద్య చికిత్స పొందాలని లబ్ధిదారులకు సూచించారు.
.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)
