దాడుల్లో గాయపడిన వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులకు కాకాణి పరామర్శ
నెల్లూరు, రవి కిరణాలు : జిల్లాలో నిన్న జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో గాయపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులను మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)కు వెళ్లిన ఆయన చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.



