గుంటూరు జిల్లా,  తాడేపల్లి, రవి కిరణాలు  :  శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉండవల్లి సెంటర్‌లో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజైన ఇవాళ అమ్మవారు భక్తులకు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో దివ్యదర్శనమిచ్చారు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్ల్లిగా భావించే లలితాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.  ఈ వేడుకల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజా నిర్వహించగా చిన్న పిల్లలకు బాల పూజ ఘనంగా జరిపించారు. అమ్మవారి నామస్మరణతో ఉండవల్లి సెంటర్ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. పూజ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.