నెల్లూరు, రవి కిరణాలు:    నెల్లూరు నగర మేయర్‌గా విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

మేయర్‌గా తన విజయం కోసం గిరిధర్ రెడ్డి చేసిన కృషి, అందించిన సహకారానికి రూప్ కుమార్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి నూతన మేయర్ రూప్ కుమార్ యాదవ్‌ను ఘనంగా సత్కరించి అభినందించారు.