ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన 27, 56 డివిజన్లకు చెందిన నాయకులు

నెల్లూరు, రవి కిరణాలు : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూర్చేలా నూతన చేరికలు జరిగాయి. నెల్లూరు మాగుంట లేఔట్‌లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 27, 56వ డివిజన్లకు చెందిన గోకరణం లీలాకుమార్, గోకరణం మునిశేఖర్, వేణుగోపాల్ యాదవ్‌తో పాటు వారి మిత్రబృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తల సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ చేరికలతో 27, 56వ డివిజన్లలో పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన నాయకులు, వారి మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు.