నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 16 మున్సిపల్ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల కోసం "విజయదీపిక స్టడీ మెటీరియల్" పుస్తకాలను మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వై.ఓ నందనలు బహూకరించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని గురువారం స్థానిక 44 వ డివిజన్ ఆచారివీధి వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించారు.
కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్పెషల్ ఆఫీసర్ వాసుబాబు లు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పి.నారాయణ ఆదేశాల మేరకు నగర నియోజకవర్గంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాదర్బార్ కార్యక్రమంలో మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్ విధి దీపాల ఏర్పాటు, డ్రైను కాలువల నిర్మాణం తదితర అంశాలతో పాటు నూతన పెన్షన్లు, ఇంటి స్థలాలకు పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని తెలిపారు. అయితే నూతన పెన్షన్లు, ఖాళీ స్థలాల మంజూరు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని, మౌలిక వసతుల కల్పన వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని మేయర్ తెలియజేశారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో అందుకున్న వినతులను అత్యంత పారదర్శకంగా, నిర్దేశించిన సమయంలోపుగా పూర్తి చేసేందుకు స్వయంగా మంత్రి నారాయణే పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు ల ఆలోచనలతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు హరికృష్ణ, సత్య నాగేశ్వరరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జ్ వద్ద 40.70 లక్షల రూపాయలతో HP క్రొత్త మోటార్లు మరియు ఆధునీకరించి ఫుట్ పాత్ పనులు ప్రారంభించిన ఇంచార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
* రాష్ట్రంలోనే అభివృద్ధి కార్యక్రమములు చెప్పటడంలో నెల్లూరు రూరల్ మొదటి స్థానంలో ఉంది. ఇంచార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్.
* రామలింగాపురం అండర్ బ్రిడ్జి తరహాలో మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి ఆధునికరించి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది . ఇంచార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్.
* కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత,రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గార్ల సహాయ సహకారాలతో వందల కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
* కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 19, 21, 37 మరియు 38 డివిజన్ లలో అభివృద్ధి పనులకు 19 కోట్ల రూపాయల నిధులు కేటాయించాము. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
* ఇంతమంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, క్లస్టర్ ఇంచార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, కో క్లస్టర్ ఇంచార్జ్లు ఖాదర్ భాష, విష్ణు ప్రియ, 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్, 21వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు చాన్ భాష,37 వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు టి.ఎస్. శ్రీనాథ్, జనసేన నాయకులు సుందర్ రామిరెడ్డి, కాకు మురళి రెడ్డి, టిడిపి నాయకులు కంటే సాయి బాబా, దాసరి రాజేష్, జానా శివయ్య, గోపాలయ్య, నరసారెడ్డి, కాయల మధు, దిలీప్ రెడ్డి, వడ్లమూడి రమేష్ చౌదరి, రియాజ్, శ్రీను, రమణారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మహేష్, బషీర్, గోవింద్, చిట్టి, కరిముల్లా, ప్రసాద్, ప్రకాష్, నవీన్, అనిల్, నిఖిల్, రాజేశ్వరి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై కలిసి పని చేద్దాం
ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ వామపక్ష పార్టీలు అంటే తనకు ఎంతో గౌరవమని ప్రజా సమస్యలకు సంబంధించి పరిష్కారంలో తన వంతు భాగస్వామ్యం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలతో ఆయన కొన్ని విషయాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా ఏం. మోహన్ రావు, సిఐటియు జిల్లా నేత అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
సర్వేపల్లి అభివృద్దిలో కీలక మలుపు
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సీఎస్సార్ నిధులతో సంపూర్ణ సహకారం అందిస్తున్న SEIL కంపెనీ. మొన్న పొదలకూరులో డయాలసిస్ సెంటర్...నిన్న వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు..నేడు బ్రహ్మదేవంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మొదటి దశలో రూ.20 కోట్లతో ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో హాస్పిటల్ నిర్మాణానికి ముందుకొచ్చిన SEIL. 30 పడకలతో నిర్మిస్తున్న ఆస్పత్రిలో ప్రజలకు వైద్యసేవలతో పాటు మెడికల్ టెస్టులు కూడా ఉచితమే సోమిరెడ్డి ప్రత్యేక వినతితో ఆస్పత్రి స్థాయిని 50 పడకలకు పెంచేందుకు కూడా సన్నాహాలు ఆస్పత్రి ప్రాంగణంలోకి రోగి ప్రవేశించి కోలుకుని బయటకు వెళ్లే వరకు అన్నీ ఉచితమే...భోజనం కూడా SEIL ఆధ్వర్యంలోనే
నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు ఉచిత శిక్షణ రేపు ఉదయం 11 గంటలకు(గురువారం) బ్రహ్మదేవంలో SEIL కంపెనీ ఆధ్వర్యంలో ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యాక శంకుస్థాపన సీఎస్ఆర్ నిధుల సద్వివినియోగంలో విజయవంతంగా ముందుకు సాగుతున్న సోమిరెడ్డి SEIL కంపెనీ సీఎస్ఆర్ నిధులతో సర్వేపల్లిలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు
రూ.1.30 కోట్లతో డయాలసిస్ యూనిట్లో 3 బెడ్లు, పొదలకూరు, వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యాధునిక స్కానర్లు, వాటర్ ప్లాంటు, కంప్యూటర్లు, జనరేటర్లు తదితర పరికరాలు
రూ.2.10 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా 42 వాటర్ ప్లాంట్లు, పొదలకూరు, వెంకటాచలం పంచాయతీల్లో రూ.3.10 సోలార్ లైట్ల ఏర్పాటుకు చర్యలు ఐదు మండలాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 8,9 తరగతుల విద్యార్థినులు 1875 మందికి రూ.95 లక్షలతో సైకిళ్ల పంపిణీకి సన్నాహాలు మల్లికార్జునపురం గిరిజన కాలనీని దత్తత తీసుకుని గిరిజనుల ఆర్థిక అభ్యున్నతికి ప్రోత్సాహం
కత్తితో వివాహిత హల్‌చల్
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కత్తితో దాడికి యత్నం. భార్య జ్యోత్స్న నుంచి తప్పించుకునేందుకు ఓ షాపులో దాక్కున్న భర్త శ్రీకాంత్. డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన శ్రీకాంత్. ఘటనా స్థలానికి చేరుకుని జ్యోత్స్న చేతి నుంచి కత్తి లాక్కున్న పోలీసులు
వరంగల్ లో చోటు చేసుకున్న ఘటన
పక్షవాతంతో మంచాన పడిన గిరిజన మహిళకు ఆర్థిక విరాళాలు సేకరించి కుటుంబానికి ఆదుకొంటున్న జై ఆదివాసీ జై భీమ్ స్వచ్చంద సేవా ట్రస్ట్ చైర్మన్ బీజేపీ నేత దుక్కేరి.ప్రభాకరరావు.మరింత ఆర్థికంగా విరాళాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి.
అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం గడుతురు పంచాయితీ విందులపనుకు గ్రామానివాసి గంగాపూజారి.సత్యవతి గత వారంలో కాపీ తోటలో కాపీ పళ్ళు కోస్తూ కళ్ళు తిరిగి క్రింద పడగా కూడికాలు కుడి చేయ్యి నోరు మాట పడిపోయాయి ఈ విషయం తెలుకొన్న భర్త ఉటా ఉటిన తోట నుండి బుజనా మోసుకొని ఇంటికి తీసుకోని వచ్చి 108 అంబులెన్సులో పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు పరిస్థితి తీవ్రంగా ఉందని గమనించిన వైద్యులు అక్కడనుండి విశాఖపట్నం కే.జీ.హెచ్. తరలించి వైద్యం అందిస్తున్నారు అయితే భర్తకి ఎటువంటి ఆధారం లేదు కొన్ని సమయాల్లో మానసిక స్థితి బాగుండదు మూడు నాలుగు సంవత్సరాల కల్గిన ఇద్దరు మగపిల్లల్ని ఇద్దరు ఆడ పిల్లల్ని కూలీ నాలి చేసి పెంచే తల్లీ ఆ కుటుంబ పరిస్థితి దయానియంగా మారింది ఈ విషయాన్ని కే.జీ.హెచ్ హాస్పిటల్ నుండి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులు సమాజా శ్రేయోభిలాషి జై ఆదివాసీ జై భీమ్ స్వచ్చంద సేవా ట్రస్ట్ చైర్మన్ మరియు బీజేపీ నేత దుక్కేరి.ప్రభాకరరావు తెలియజేయ్యగా తను కొందరి ద్రుష్టి తీసుకోని వెళ్లి కొంతఆర్థిక విరాళాలు సేకరించి కుటుంబానికి అందజేశారు,కానీ అది ఏ మాత్రం ఆ కుటుంబానికి సరిపోదని మరింత ఆర్థిక సహాయం చేసే దాతలు ముందుకొచ్చి సత్యవతి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు ఆర్థిక సహాయం చేసే దాతలు 7981391699 దుక్కేరి.ప్రభాకరరావు ఫోన్ నెంబర్ కి ఫోన్ పే చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు,