మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
కలెక్టర్ హిమాన్షు శుక్లా గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు, రవికిరణాలు సెప్టెంబర్ 30 :
నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.. జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ హిమాన్షు శుక్లా గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. నగరంలోని కలెక్టరేట్ కు వచ్చిన ఎంపీ.. కలెక్టర్ కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి.. కలెక్టర్ తో భేటీ అయ్యి జిల్లా అభివృద్ధిపై చర్చించారు. జిల్లా సమస్యలను, చేపట్టాల్సిన అంశాలు, పెండింగ్ విషయాలపై మాట్లాడారు. కలెక్టర్ ను కలిసిన వారిలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఈరోజు గాయత్రీదేవి అలంకారంలో వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారు
రవికిరణాలు, సెప్టెంబర్ 23 :
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఈరోజు గాయత్రీదేవి అలంకారంలో వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని మహిళా మంత్రులు, సహచర మహిళా శాసనసభ్యులతో కలిసి దర్శించుకొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాప్తాడు శాసనసభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు.
ఈ సందర్బంగా అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది...