నెల్లూరులో అధికార పార్టీ అండ చూసుకుని కార్యకర్తలు రెచ్చిపోతున్నారు
June 14, 2020
Andhrapradesh
,
Nellore
,
tdp
,
ycp
నెల్లూరులో అధికార పార్టీ అండ చూసుకుని కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. తాజాగా వీఎంఆర్ నగర్‌లో ఓ YCP కార్యకర్త, తన భార్యతో కలిసి విజయలక్ష్మి అనే మహిళపై దాడి చేశాడు. ఇనుప రాడ్‌తో ఆమె తల పగలగొట్టాడు. స్థానికంగా వాలంటీర్‌గా పనిచేస్తున్న కవిత, ఆమె భర్త కలిసి చేసిన ఈ దాడి ఒక్కసారిగా కలకలం రేపింది. TDP కార్యకర్తగా ఉన్న శేషు తల్లిపై జరిగిన దాడితో అంతా ఉలిక్కిపడ్డారు. తీవ్ర గాయాలపాలైన విజయలక్ష్మిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జ్ అబ్దుల్ అజీజ్.. ఆస్పత్రికి వెళ్లి పరా
మర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.





