భూగర్భ డ్రైనేజీ కార్మికులు రక్షణ ఉపకరణాలు తప్పనిసరిగా వినియోగించాలి కమిషనర్ వై.ఓ నందన్
భూగర్భ డ్రైనేజీ కార్మికులు రక్షణ ఉపకరణాలు తప్పనిసరిగా వినియోగించాలి కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు, కార్పోరేషన్, రవికిరణాలు జూలై 16 :
విధుల నిర్వహణలో భూగర్భ డ్రైనేజీ కార్మికులు రక్షణ ఉపకరణాలను తప్పనిసరిగా వినియోగించాలని కమిషనర్ వై.ఓ నందన్ సూచించారు.
"జాతీయ నమస్తే డే" ను పురస్కరించుకొని నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ క్లీనింగ్ కార్మికులు, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కార్మికులకు సర్టిఫికెట్ ఆఫ్రిసియేషన్ ఆయుష్మాన్ భవ ఆరోగ్య కార్డులను కమిషనర్ అందజేసి వారిని ఘనంగా సన్మానించారు.
నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవలకు గాను ఆయుష్మాన్ భవ కార్డుల ద్వారా ప్రతి ఒక్క కార్మికునికి ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.
భూగర్భ డ్రైనేజీ పనులు, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ విధుల సందర్భంలో కార్మికులందరూ తప్పనిసరిగా రక్షణ ఉపకరణాలను ధరించాలని కమిషనర్ సూచించారు. కార్మికులకు రక్షణ కల్పించడమే ప్రాధాన్యతగా భూగర్భ డ్రైనేజీ కార్మికులకు ప్రభుత్వం నిర్దేశించిన రక్షణ ఉపకరణాలను అందించి వారి సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్మోహన్ రావు, ఈ.ఈ అనిల్, ఏ.ఈ నరేంద్ర, పి.ఎమ్.యు సాయి కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.