జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (JAAP) నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగినది
శ్రీకాకుళం, రవికిరణాలు జూలై 18 :
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (JAAP) రాష్ట్ర అధ్యక్షులు ఏ రవీంద్ర బాబు(రవితేజ) గారు ఉపాధ్యక్షులు అవనాపు సత్యనారాయణ గార్ల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగినది జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా జి. షణ్ముఖరావును,ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జి ఆర్ ఇజ్రా గార్లతోపాటు 30 మందితోజిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు షణ్ముఖరావు మాజీ అధ్యక్షులు నూరు చంద్రశేఖర్ ను గౌరవ అధ్యక్షులుగా ప్రతిపాదించగా సభ్యులు ఆమోదించారు అనంతరం శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ గారు కార్యవర్గాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చెన్నకేశవరావుకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా శాఖ కలవగా అభినందనలు తెలియజేసి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో JAAP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేవిఆర్ గోపాల్ వర్మ శ్రీకాకుళం జర్నలిస్టులు పాల్గొన్నారు.
Post a Comment