స్టూడియో అండ్ అకాడమీ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య.
నెల్లూరు [కావలి], రవికిరణాలు జూలై 30 :
కావలి పట్టణంలో స్థానిక టీచర్స్ కాలనీలో బుధవారం కైరా మేకప్ స్టూడియో అండ్ అకాడమీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు అనంతరం కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ శిక్షణ అందించి పలువురికి ఉపాధి కలిగేలా చూడాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నంతవరకు శిక్షణలో పరిపూర్ణులై స్వయం ఉపాధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుంటుపల్లి రాజకుమార్, పి. శ్రీనివాసులు తిరువీధి ప్రసాద్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post a Comment