గొల్లకందుకూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం
నెల్లూరు [రూరల్], రవికిరణాలు జూలై 22 :
నెల్లూరు రూరల్ మండలం లోని గొల్లకందుకూరు గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ యాదవ్ మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ....రెవెన్యూ సమస్యలు లేని నియోజకవర్గంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని తెలియజేయడం జరిగింది.గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.అలాగే 9 రోజులపాటు ఏకధాటిగా నెల్లూరు రూరల్ లో 18 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు రోజుకి 2 గ్రామాలు చొప్పున ఉదయం ఒక గ్రామం మధ్యాహ్నం ఒక గ్రామం లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం నెల్లూరు రూరల్ మండల తహశీల్దార్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.... ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే రెవెన్యూ సదస్సును సద్వినియోగం చూసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ నాసర్, రూరల్ ఆర్.ఐ. శివ మరియు సీనియర్ టిడిపి నాయకులు ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి, మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మండల కార్యాలయం ఇంచార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బెల్లంకొండ దొరసానమ్మ, జడ్పీ కో- ఆప్షన్ నెంబర్ అల్లాబక్షు, మండల కో- ఆప్షన్ నెంబర్ మీరామోహిద్దీన్, టిడిపి నాయకులు దయాకర్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పెంచాల నారాయణ, సిద్ధారెడ్డి శ్రీనివాసులురెడ్డి, వినుకోటి వేమయ్య గ్రామ రెవెన్యూ అధికారి కార్తీక్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post a Comment