పీఎం జీవన జ్యోతి యోజనను సద్వినియోగం చేసుకోండి ఎస్బిఐ చీఫ్ మేనేజర్ లక్ష్మీనరసింహులు
నెల్లూరు [పొదలకూరు], రవికిరణాలు జూలై 30 :
ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన పథకాన్ని ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని పొదలకూరు ఎస్బిఐ చీఫ్ మేనేజర్ డి లక్ష్మీనరసింహులు కోరారు. బ్యాంక్ ఆవరణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పి ఎం జె జె వై పథకంలో ఏడాదికి రూ. 436లు చెల్లించినట్లయితే వారికి రూ.2లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. అలాగే సాధారణ మరణం పొందిన వారికి కూడా ఈ పథకంలో రెండు లక్షలు బీమా సౌకర్యం ఉన్నట్లు వివరించారు. కాగా ప్రధానమంత్రి సురక్ష యోజన పథకంలో భాగంగా ఏడాదికి 20 రూపాయలు చెల్లించినట్లయితే వారికి రెండు లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. ఆయా భీమా పథకాలలో దరఖాస్తు చేసుకున్న వారి బ్యాంక్ ఖాతాల నుంచి ఏడాదికి రూ. 20లు, రూ. 436లు చొప్పున కట్ చేసుకోవడం జరుగుతుందన్నారు. అనుకోకుండా అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ కుటుంబాలకు బీమా పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కాబట్టి ఎస్బిఐ ఖాతాదారులందరూ ఈ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్బంగా ఆయన సూచించారు.
Post a Comment