కావలి మున్సిపల్ కమిషనర్ శివా రెడ్డి గారికి
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తుఫాన్ నగర్ ఈద్గా నందు
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి ఈద్ నమాజ్ నిర్వహించ నందున ఈద్గా పరిసర ప్రాంతంలో
ఈద్ నమాజ్ నిర్వహణకు సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో YSR CP పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ నాయబ్ రసూల్ 18వ వార్డు ఇంచార్జ్ షేక్ అబ్దుల్లా వాయిస్ ఆఫ్ ముస్లిం అధ్యక్షులు మొగల్ సలీం బేగ్ జామియా మసీద్ ఆష్ కమిటీ సభ్యులు షేక్ రషీద్ షేక్ రియాజ్ మన్సూర్ గౌస్ ఖాన్ భాషా తదితరులు పాల్గొన్నారు
వ్యవసాయ శాఖ మంత్రి కాకాని వ్యవసాయం చేసేవారి ఇబ్బందులు మీకు తెలుసా...?
అంటూ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ చెన్నారెడ్డి గారి నాయకత్వం లో జిల్లా నాయకులు కిషోర్ గునుకుల గారు, దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారు తదితర నాయకులు జిల్లా కార్యలయం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలు ఒత్తిడులు తట్టుకోలేక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షాలుతో కలిసి రాష్ట్ర అధికారం సాధిస్తామని భయంతో కొత్తగా వచ్చిన మంత్రులు నోరు పారేసుకుంటున్నారు.. పుట్టి కి 850 కేజీలు అని ఆ పుట్టుక 16600 మద్దతు ధర కల్పించాలని జ్ఞానం ఉన్నదా గత మూడు సంవత్సరాల నుంచి పుట్టు అంటే 1050 కేజీల గా లెక్కగట్టి రూ16,600 ఇస్తున్నారని 850 కేజీల పుట్టు కి 16600 గిట్టుబాటు ధర కల్పించడంలో మీరు విఫలమవుతున్నారని తెలియదా గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి భూగర్భ జలాలు జలాలు మీ కార్యకర్తలు కనుసన్నుల్లో గురవుతున్నాయని తెలుసా... భూగర్భ జలాల అందక పక్కవారికి పొలాల్లో పైరు వేయలేని పరిస్థితి ఉందని తెలుసా... థర్మల్ ప్లాంట్ కాలుష్యానికి చుట్టుపక్కల రైతులు మాడి మసై పోతున్నారని తెలుసా... మీ నియేజకవర్గం కాలుష్య కోరల్లో ఇరుక్కుని జిల్లావ్యాప్తంగా జబ్బులు బారిన పడుతున్నారని తెలుసా.. అడ్డగోలుగా పోర్టులో పోర్టులో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తూ దొరికిన చోటల్లా మైనింగ్ దోపిడికి గురి చేస్తూ తెలివి లేని మాటలు మాట్లాడకండి పరిశ్రమల కాలుష్యం మాకు వాటి లో ఉద్యోగాలు నీరు జిల్లా లోని ప్రజలకు ఇవ్వడంలేదని తెలుసా సర్వేపల్లి కాలువ బాగు చేస్తే పొలాలతో మంచినీటి సౌకర్యం ఉన్నా ఆ పనిని సాగనివ్వం పోతున్నామని తెలుసా... వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమై కోట్ల రూపాయల సంపాదన లో మునిగి సహజ సహజ సిద్ధంగా ఏర్పడిన పోర్టు అభివృద్ధి తుంగ లోకి తొక్కిందని మీకు తెలుసా... మీ నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాల వారీగా పంచాయతీల వారీగా ఎన్ని పుట్లు కొన్నారో ప్రకటించగలరా... 10 సంవత్సరాల కిందట కృత్రిమంగా పెద్ద బెర్త్ కలిగి ఉన్నా ఇప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలలో సౌకర్యాలు ఏర్పాటు చేయడం విఫలం అయ్యారు అని తెలుసా... ఎవరికీ ఏ ఆపద వచ్చినా వెంటనేపదవుల లో ఉండి మీరు చేయాల్సిన పని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి అతని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర కల్పించడం లో విఫలమైన మీరు ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు తన సంపాదనలో నుంచి డబ్బులు డబ్బులు తీసి ఇస్తున్నాడని ఓర్వలేక ఎక్కడ ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందని నీకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు మీకు ఉన్న భూములు మీరు సొంతంగా ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, కౌలుదారులకిచ్చిన మీరు వారి ఇబ్బందులు పట్టించుకున్నారా జిల్లాలోని ఒక నియోజకవర్గంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మీరు కక్షసాధింపు చేస్తే కక్షసాధింపు చర్యలకు అందరికీ తెలిసినదే రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసే పరిస్థితి లేదు మంత్రి పదవి ఇచ్చిన ప్రతి ఒక్కరూ వేషాలు వేస్తున్నారు ఇలాంటి వారికి అందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లేదు మంత్రి గా బాధ్యతలు వచ్చేసాయి గానీ ఇక మీ జగన్ ఇక ఇచ్చేదేమీ లేదు.. దళారుల చేతుల్లో ధగా పడుతున్న రైతులను కాపాడే ప్రయత్నం చేయండి అంతేగాని టైం పాస్ మాటలు టైం పాస్ వ్యవహారాలు నడిపించకండి మేం ఎమ్మెల్యేలం మేం మంత్రులం అని జబ్బలు చరుచుకున్నది చాలు వ్యక్తిగత విషయాలు మాట్లాడకుండా అభివృద్ధి అనేది ఇప్పటికైనా చూపించండి అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని ప్రగల్భాలు పలకడం లేదు గడిచిన మూడు సంవత్సరాల్లో మూడు వేల మంది రైతులు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు అంటే 30 కోట్ల రూపాయలు జనసేన పార్టీ తరఫున తనవంతు సాయంగా జనసేన అధ్యక్షులు ఆదుకుంటున్నారు.... చేతనైతే ఈ మూడు వేల మందికి ప్రభుత్వం ప్రకటించిన ఏడు లక్షల రూపాయలు ఇచ్చి మాట్లాడారు... ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు కిషోర్ గునుకుల,దుగ్గిశెట్టి సుజయ్ బాబు, కొట్టే వెంకటేశ్వర్లు, కోలా విజయలక్ష్మి , శ్రీనివాసుల రెడ్డి, మల్లి కిరణ్, అనిల్, నాయకులు హరి, రమేష్, వరకుమార్, తదితరులు పాల్గొన్నారు
పైలాన్ దోషులను శిక్షించాలని ఉపరాష్ట్రపతిని కలవనున్న అఖిలపక్ష నేతలు..
ఏఎస్పీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలి..
కావలి పట్టణంలో పైలాన్ ను ద్వసం చేసి రెండు సంవత్సరాలు దాటుతున్నా దోషులను ఇంతవరకు పట్టుకుని శిక్షించకపోవటం పోలీసుల భాద్యత రాహిత్యం అని దీనిపై రేపు జిల్లాకు విచ్చేయిచున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కు పిర్యాదు చేస్తామని అలానే పైలాన్ దోషులను కాపాడుతున్న ఏఎస్పీ ప్రసాద్ పైన కూడా పిర్యాదు చేస్తామని కావలి అఖిలపక్ష నేతలు తెలిపారు. సోమవారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు అఖిలపక్ష నేతలు దామా అంకయ్య ( సి.పి.ఐ )పసుపులేటి పెంచలయ్య (సి.పి.యం)జ్యోతి బాబురావు(టీడీపీ)కరవది బాస్కర్( న్యూ డెమక్రసీ)డేగా సత్యం (సి.పి.ఐ) మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కావలిలో మున్సిపాలిటీ అమృత్ పధకం క్రింద గతంలో క్రేంద్రలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమృత్ పధకం పైలాన్ ను ద్వసం చేయనున్నట్లు వస్తున్న ప్రచారంలో అనుమానంతో ముందుగానే అప్పటి మున్సిపల్ కమిషనర్ అప్పటి సబ్ కలెక్టర్ శ్రీధర్ కు పిర్యాదు చేయటం కూడా జరిగిందన్నారు. అయితే ఆ పైలాన్ ను కాపాడాల్సిన రెవిన్యూ అధికారులు, పోలీస్ అధికారులు మిన్నకుండటమే కాకుండా సీసీ కెమెరాల సైతం ఆప్ చేయటం జరిగిందన్నారు. అలానే పైలాన్ ద్వసం చేసిన తరువాత భూమి పూజ పేరుతో కావలి రెవెన్యూ అధికారుల పోటోలతో పాటు పోలీస్ అధికారుల పోటోలతో ప్లెక్సీ ఏర్పాటు చేయటం వేనుక ఎవరి హస్తం ఉందో తెలియాలన్నారు. పైలాన్ ద్వసం చేస్తారని ముందొస్తుగా తెలిసినా దానిని ఆపకపోగా దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలానే పైలాన్ ద్వసం పైన కేసు పెట్టినా ఇంతవరకు దోషులను పట్టుకోవటంలో కానీ ,కేసు విచారణ లో ఉందో లేదో కూడా తెలియటం లేదన్నారు.అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏఎస్పీ ప్రసాద్ కావలి పట్టణంలో ఏ కేసులో నైనా బాధిత వ్యక్తులకు న్యాయం చేయకపోగా ఎవరైతే బాధించారో వారికే న్యాయం చేయటం జరుగుతుందన్నారు. ఉదాహరణకు ముసునూరులో దళిత బాధితుల దగ్గర నుంచి, ఎన్టీఆర్ విగ్రహం కానీ, పైలాన్ కానీ ,రామంజపురం ఘటన కానీ ఇలా ఎన్నో కేసులలో న్యాయం చేయకపోగా అవతలి వ్యక్తులకు అండగా నిలబడిన సంఘటనలు ఉన్నాయన్నారు.దీంతో భాధితులు పోలీస్ స్టేషన్ కు వెల్లాలంటే భయాందోళనకు గురవుతున్నారన్నారు. అలానే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం లో ఉన్నా పైలాన్ దోషుల పై చర్యలు తీసుకోవాలని పోలీసులు ,రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తేకపోగా బిజెపి అగ్రనేతల దగ్గరకు తీసుకోపోవటంలో కావలి బిజెపి నేతలు విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా పైలాన్ దోషులను పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏ ఎస్పీ ప్రసాద్ పై చర్యలు తీసుకొని అతనిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు..
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిథానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝ
నాల్కో, మిధాని సంయుక్త సంస్ధ ఉత్కర్ష అల్యుమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ (యూడీఏఎన్‌ఎల్) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్ అల్యుమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ
రూ. 5,500 కోట్లతో ఏర్పాటుకానున్న పరిశ్రమ, ఏడాదికి 60,000 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ, రెండు నుంచి రెండున్నరేళ్ళలో ప్రాజెక్ట్ పూర్తి
దాదాపు 750 – 1000 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగావకాశాలు
ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చిన అధికారులు, వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సీఎం ఆదేశాలు
రక్షణ అనుబంధ రంగాలకు సంబంధించిన పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను కూడా ఏర్పాటుచేయాలని సూచించిన సీఎం, అంగీకరించిన సీఎండీలు
ఈ సమావేశంలో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్.సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీమతి K. శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు నెల్లూరు -2 సెబ్ . ఇన్స్పెక్టర్ V. వెంకటేశ్వరరావు వారి సిబ్బందితో శనివారం రాత్రి నుండి తెల్లవారు జాము వరకు వెంకటచలం టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన వాహన తనఖిలలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకొని అతని వద్దనుండి 35.800 కిలోల గంజాయి స్వాధీనపరచుకొనుట జరిగింది .
అరెస్టుకాబడిన ముద్దాయి వివరాలు : Palpandi Kaluyani devar , S / o Kaluyani devar , Age : 41 , Caste : Devar , R / o Santhmanaickanpatti . Pudupatti , Dindigul , Tamil Nadu , Aadhar No : 5297 9612 2130 .
1వ కేసు వివరాలు
గన్నవరం డిపోకి చెందిన ఆర్.టి.సి బస్ లో పై తెలిపిన వ్యక్తి విజయవాడ నుండి
తిరుపతికి ప్రయాణిస్తూ తనతో పాటు 19.700 KGS గంజాయిని విజయవాడ లో నాయుడు
అనే వ్యక్తి వద్ద రూ .40000 / – కు కొనుగోలు చేసి తమిళనాడులో దిండిగల్ టౌన్
లో kg రూ . 10,000 / – చొప్పున అమ్మడానికి రవాణా చేస్తుండగా స్వాధీనం
చేసుకున్నారు .
2 వ కేసు వివరాలు : అరెస్టుకాబడిన ముద్దాయిల వివరాలు
A1 ) Ropypen Mariasemon , S / o Mariasemon , Age : 42 , Caste : Nadar . R
/ o 18-40 A. Man Code , Kallupottai , Thikkanamcode , Kanniyakumari ,
Tamilnadu , 11/33 A.
A2 ) Anthonimuthu Siluvai Muthu , S / o Siluvai Muthu , Age : 66 , Caste
: Nadar , R / o Saralvilai , Thengankuzhi , Kalkulam , Kanniyakumari ,
Tamil Nadu
విజయవాడ ఆటోనగర్ డిపోకి చెందిన APSRTC బస్ లో పై తెలిపిన వ్యక్తులు విజయవాడ నుండి చెన్నైకి ప్రయాణం చేస్తూ 16.100 కిలోల గంజాయిని కలిగియుండగా స్వాధీనం చేసుకున్నారు . ఆ గంజాయిని వారు కన్యాకుమారి లో ఉన్న కుమార్ అను వ్యక్తి సూచనల ప్రకారం తునిలో గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుంచి తీసుకుని కన్యాకుమారిలో ఉండే కుమార్ అను వ్యక్తికి అందచేయుటకు వెళ్తుండగా స్వాధీనపర్చుకున్నారు . ఇలా రవాణా చేసినందుకు గాను వారిద్దరికీ కుమార్ ఒక్కొకరికి రూ .5000 / – లు మరియు రవాణా ఖర్చులు ఇస్తాననే ఒప్పందంతో పంపాడు . మార్గ మధ్యంలో నెల్లూరు సెబ్ అధికారులు పట్టుకున్నారు . పైనేరానికి పాల్పడిన వారిని పట్టుకొను నిమిత్తం రూట్ వాచ్లో నెల్లూరు -2 సేన్ , EI V. వెంకటేశ్వరరావు , Sub – Inspector , N. శకుంతలాదేవి , హెడ్కానిస్టేబుల్ S. సాయిబాబు , కానిస్టేబుల్స్ , R. శ్రీహరి, మోహన్ , పెంచలయ్య , మల్లిఖార్జునరావు పాల్గోన్నారు . వీరిని నెల్లూరు సెట్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి కె . శ్రీలక్ష్మి అభినందించినారు .
పట్టుకున్న గంజాయి మార్కెట్ విలువ సుమారు రూ .3,60,000 / – లు .
25.04.2022 . S. Asst . Enforcement Superintendent Special Enforcement Bureau . Nellore
నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించండి : కమిషనర్ జాహ్నవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో రూపొందించిన స్పందన వేదిక ద్వారా ప్రజా సమస్యలకు నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందజేయాలని కమిషనర్ జాహ్నవి అధికారులకు సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో స్పందన వేదికను కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్పందన వేదికలో ఒకసారి స్వీకరించిన సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని, సమస్య పునరావృతం కాకుండా అధికారులనుంచి సిబ్బంది వరకు కృషి చేస్తున్నామని వివరించారు. ప్రధానంగా టిడ్కో హౌసింగ్, రెవెన్యూ, పారిశుధ్యం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు సంభందించి 34 అర్జీలను ప్రజలనుంచి అందుకున్నామని, అందుకున్న ఫిర్యాదులకు స్పందన వేదిక ద్వారా వేగవంతమైన పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ వై.ఓ.నందన్, ఎస్.ఈ సంపత్ కుమార్, మేనేజర్ రాజేంద్రప్రసాద్, నగర పాలక సంస్థలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.