నెల్లూరు: జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో దారుణం జరిగింది. కాలేజిమిట్ట ప్రాంతంలో ఇంటర్ విద్యార్థి జ్యోతి(18) పై ప్రేమోన్మాది చెంచుకృష్ణ కత్తితో దాడి చేశాడు. జ్యోతి (18) గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. తనను ప్రేమించలేదని కోపంతో జ్యోతిపై చెంచుకృష్ణ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జ్యోతి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మండల పరిధిలోని కోటపోలూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ ఖరేశ్వరస్వామి ఆలయ ఆవరణమంతా శనివారం సాయంత్రం శివ నామస్మరణతో మార్మోగింది. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో శోభిల్లింది. భక్తి భావం వెల్లివిరిసింది. శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ ఖరేశ్వరస్వామి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ఇక్కడి శివాలయం ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం ఖరేశ్వరస్వామి కల్యాణం కమనీయంగా సాగింది. ఆలయ కమిటీ నిర్వాహకులు కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమైన కళ్యాణోత్సవాన్ని భక్తులు తిలకించి పరవశించారు .ఈ కల్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మండల అధ్యక్షుడు అల్లూరు అనీల్ రెడ్డి,తడ మండల అధ్యక్షుడు కొళివి రఘు, విచ్చేశారు. వారికి ఆలయ ధర్మకర్త గ్రిద్దటి శ్రీధర్ రెడ్డి,ఆలయ కార్యనిర్వాహకురాలు కుడిముడి మమత ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులచే అమ్మవారి, స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు గూడూరు వెంకటనాగ మల్లేశ్వరరావు పర్యవేక్షణలో యజ్ఞకులు మడమనూరు మల్లికార్జున గురుకులు,వేదపారాయణక పండితులు కాశీబాట్లశరత్ కుమార్ శర్మ స్వాములు కల్యాణ తంతు జరిపించారు.ఈ కళ్యాణ వేడుకలకు విచ్చేసిన మహిళా భక్తులకు ముత్యాల తలంబ్రాలు, పసుపు,కుంకుమ గాజులను అందజేశారు. అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలను పంచిపెట్టారు.ఈకార్యక్రమంలో కోటపోలూరు MPTC సత్యవేటి శ్రీజ, సర్పంచ్ కమతం అరుణ కుమారి, ఆరణి విజయభాస్కర్ రెడ్డి, బద్ధిపూడి మోహన్ రెడ్డి,అల్లూరు రమేష్ రెడ్డి, మెల్లకంటి వీరాస్వామి, తనమాల వెంకటరమణారెడ్డి, తనమాల నారాయణరెడ్డి, కమతం గోవర్ధన్, పెరింబేటి వేణుగోపాల్, యర్రం మనోజ్ కుమార్ మరియు భక్తులు పాల్గొన్నారు.
జాతీయ రహదారులు ప్రక్కన ఉన్న గ్రామాలకి ఏర్పాటు చేయబడును సోలార్ వీధిలైట్లు బ్యాటరీలు దొంగలించిన ముద్దాయిలను అరెస్టు చేసిన పోలీసులు..........................
దొరవారిసత్రం మండలం పరిధిలోని నేతాజీ నగర్.. అయ్యే పాలెం గ్రామాల్లో బ్యాటరీలను మరియు పలుకూరు మండల పరిధిలో 3 సోలార్ బ్యాటరీలను వివిధ సమయాల్లో దొంగిలించిన బ్యాటరీలను దొరవారి సత్రం ఎస్సై అజయ్ కుమార్ గారు పట్టుకోవడం జరిగింది.వారిలో ముద్దాయిలు తాతం శెట్టి బాలగోపాల్ మరియు జిలకర మల్లికార్జున పట్టుకోవడం జరిగింది. వేల దగ్గర్నుంచి దగ్గర నుంచి సోలార్ బ్యాటరీలు 4 మరియు 69 వేలు డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్లను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కేసును చేదించు లో సహకరించిన దొరవారిసత్రం పోలీస్స్టేషన్ సిబ్బంది హెచ్ సి సూర్యనారాయణ మరియు హెచ్ సి వెంకటేశ్వర్లు మరియు టి సి రామచంద్రయ్య టి సి హరికృష్ణ లను నాయుడుపేట సి ఐ శ్రీ వై వి సోమయ్య గారు అభినందించారు.
MPTC సభ్యుల శిక్షణా తరగతులను సద్వినియోగ పరుచుకోండి గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు స్థానిక కావలి మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న కావలి నియోజకవర్గ ఎంపిటిసి సభ్యుల శిక్షణ కార్యక్రమమునకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అల్లూరు బోగోలు కావలి దగదర్తి మండలం లోని ఎంపిటిసి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించుకోవాలి అని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా ప్రజలకు అందే విధంగా MPTC సభ్యులు సహకరించాలని కోరారు విధులు బాధ్యతలు పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరినారు పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందరకు అందించాలని సూచించారు అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది కూడా స్వయంగా పరిశీలించాలని కూడా కోరారు అందుకనే ప్రతి ఒక్క ఎంపీటీసీ సభ్యుడు ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా సూచించారు అప్పుడే ప్రజా పాలన సులువుగా ఉంటుందని కూడా సూచించారు ఎక్కడైనా సంక్షేమ పథకాలు ప్రజలకు అందక పోతే ఆ వివరములు సేకరించి వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని కూడా సూచించారు ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేసినారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు జంపని రాఘవులు మండల పరిషత్ అధ్యక్షురాలు ఆలూరి కొండమ్మ దగదర్తి మండల పరిషత్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు ఎఎంసి వైస్ చైర్మన్ శ్రీనివాసులు అన్ని మండల ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ సభ్యులు మరియు అల్లూరు ఎంపీడీవో నగేష్ కుమారి బోగోలు ఎంపీడీవో నాసరరెడ్డి దగదర్తి ఎంపిడిఓ శ్రీదేవి MOT సభ్యులు మరియు ఇతర అధిక
కావలి పట్టణం లోని శ్రీ లక్ష్మీ కాంత స్వామి వారి దివ్య ఆలయ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీ అమ్మవారి ప్లవ నామ సంవత్సర ఫాల్గుణ మాస శుద్ధ త్రయోదశి శ్రీలక్ష్మి జయంతి మహోత్సవ వేడుకలు త్రయాహ్నక దీక్ష తో శ్రీ వైఖానస భగవ శాస్త్రిరీత్యా తల పెట్టిన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆర్ డి ఒ శ్రీ నూ నాయక్, కమీషన్ శివారెడ్డి అధిక సంఖ్యలో భక్తులందరూ విచ్చేసి శ్రీ లక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. వంశపారంపర్య అర్చకులు ఆగమద్యమణి శ్రీమన్నారాయణ వెంకట శేషాచార్యులు దివ్య ఆశీస్సులతో పూజలు నిర్వహించినట్టు రామాచార్యులు తెలిపారు.
సామూహిక కుంకుమార్చన మరియు శాంతి కళ్యాణం లో పలువురు దంపతులు పాల్గొన్నారు.
మండలం లో విధ్యుత్ శాఖ కు సంబందించిన D లిస్ట్ లో ఉన్న పెండింగ్ బకాయిలను లైన్ ఇన్స్పెక్టర్ నెల్లిపూడి. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వాసులు చేశారు. లైన్ ఇన్స్పెక్టర్ తో పాటు ఎలక్ట్రికల్ సిబ్బంది కలిసి పెండింగ్ బకాయిలను వసూలు చేసి ప్రభుత్వనికి చెల్లించారు. ఇంటింటికి తిరిగి విద్యుత్ బకాయిలను వసూలు చేసిన వారిని పై అధికారులు గుర్తించి మండల సిబ్బంది కి కూడా అవార్డు లను అందజేశారు. ఈకార్యక్రమంలో మండల విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
తమ స్టడీ టూర్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 10 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ వారికి సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ పుట్టుక, ప్రస్థానం, ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. శ్రీసిటీ కార్పొరేట్ సామాజిక భాద్యత (సిఎస్ఆర్) కార్యక్రమాల గురించి చెబుతూ, నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సేవలు, సామాజిక మౌళిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారించడం ద్వారా శ్రీసిటీ పరిసర వెనుకబడిన ప్రాంతం ఎలా అభివృద్ధి సాధించిందో వివరించారు.
ఇక్కడ ప్రపంచశ్రేణి మౌళికవసతులు, వ్యాపారానుకూల వాతావరణం పట్ల ట్రైనీ ఐఏఎస్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీసిటీ స్పష్టమైన దృష్టి, మంచి ప్రణాళిక, ఖచ్చితమైన అమలు, ఉపాధి కల్పన, స్థిరమైన పట్టణీకరణ సూత్రాలను ప్రశంసించిన అధికారులు, దీనికి కృషిచేసిన శ్రీసిటీ యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ పర్యటనపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్పందిస్తూ, ట్రైనీ ఐఏఎస్ ల అధ్యయనానికి శ్రీసిటీని ఎంచుకోవడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. ట్రైనీ ఐఏఎస్ లే కాకుండా దేశ విదేశాలకు చెందిన అధికారులు, వ్యూహకర్తలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు తమ అధ్యయనానికి శ్రీసిటీని "తప్పనిసరి ఆప్షన్" గా ఎంచుకోవడం తమకు గర్వకారణమన్నారు.
ఏపీ దర్శన్ లో భాగంగా శ్రీసిటీకి విచ్చేసిన ఐఏఎస్ శిక్షణ అధికారులు, ఈ సందర్భంగా ప్రాజెక్టు గురించి తమ పలు సందేహాలను సవివరంగా అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూడడంతో పాటు ఆల్స్టామ్, మాండెలెజ్, ఇసుజు, టోరె పరిశ్రమలను సందర్శించారు.