కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలయ్యే పథకాల్లో నెల్లూరు జిల్లా అగ్రస్థానంలో ఉందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. జిల్లా మౌలిక సదుపాయాల కల్పన సలహామండలి (దిశ) సమావేశం శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన భవన్లో జరిగింది. దీనికి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. కలెక్టర్ చక్రధర్ బాబు, మేయర్ పొట్లూరు స్రవంతి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ ఆదాల మాట్లాడుతూ 43 అంశాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాల్సిన ఈ సమావేశం కోవిడ్ కారణంగా గత 6 నెలలుగా జరగలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఆయా పథకాల ద్వారా ఏ మేరకు సద్వినియోగం అయ్యాయి, ఇంకే సమస్యలు ఉన్నాయనే విషయం గా సమీక్షించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పనుల్లో కోటి 18 లక్షల పనిదినాలను కల్పించి దేశంలోనే నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ప్రశంసించారు. అదేవిధంగా పి.ఎం.ఏ.జి.వై పథకం కింద ఎస్సీ ,ఎస్టీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో జిల్లా రెండో స్థానం సాధించిందని పేర్కొన్నారు. 160 గ్రామాలలో డ్రోన్ ద్వారా సర్వే చేసి జిల్లా దేశంలోనే ముందంజలో ఉందని తెలిపారు. స్వచ్ఛ పర్యవేక్షక ర్యాంకింగ్లో నెల్లూరు నగర పాలక సంస్థ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి 10 కోట్ల రూపాయల నగదు బహుమతిని సాధించడం గర్వించదగిన విషయమని కితాబునిచ్చారు. పీ.ఎం కిసాన్ అమలులో జాతీయ అవార్డు లభించిందని పేర్కొన్నారు. రైతులు రైతు భరోసా మొత్తాలను సకాలంలో అందించడం ద్వారా ఈ అవార్డు దక్కిందని తెలిపారు. కోవిడ్ నివారణ చర్యల్లో కూడా మన జిల్లా ముందంజలో ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ లో నెంబర్వన్ స్థానాన్ని సాధించిందని ప్రశంసించారు. వెయ్యి మందికి పైగా ప్లాస్మా చికిత్స అందించామని, కోటి ఎనభై ఐదు వేల మందికి కోవిడ్ చికిత్సను అందించినట్లు తెలిపారు. ఉక్రెయిన్ లో ఉన్న 25 మంది విద్యార్థుల్లో ఇప్పటికే 11 మంది జిల్లాకు చేరారని, మిగతా వారిని కూడా రప్పించేందుకు జిల్లా కలెక్టర్ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని పనిచేస్తున్నారని తెలిపారు. జిల్లాను పలు పథకాల అమలులో అగ్రస్థానంలో ఉంచిన జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు తన అభినందనలు మనస్ఫూర్తిగా తెలిపారు.డ్వామా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జేసి గణేష్ నాయక్ అధికారులను పర్యవేక్షించారు. ఎంపీ విలేకర్ల సమావేశంలో విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, పాముల హరి ప్రసాద్, శ్రీధర్ రెడ్డి, నరసింహారావు , మైపాడు అల్లాబక్షు, మధు తదితరులు పాల్గొన్నారు.
రైలు పట్టాలపై అనుమానాస్పద మృతి
అంగరంగ వైభవంగా శ్రీ గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామి వారి గ్రామోత్సవం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట : పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద వెలసియున్న శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి గ్రామోత్సవము గురువారం రాత్రి విద్యుత్ దీప, విశేష పుష్ప అలంకరణ, బాణసంచా వేడుకలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
స్థానిక శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య సారధ్యంలో చెన్నా రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి (స్వామి రెడ్డి) ఆధ్వర్యంలో మహా శివ రాత్రిని పురస్కరించుకొని ఐదు రోజుల పాటు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఛాంపియన్ చంద్రారెడ్డి, కాఫీ రెడ్డి దయాకర్ రెడ్డి, చంద్రమౌళి రెడ్డి, దయాకర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డిలు గ్రామ పెద్దలు, భక్తులు భారీగా పాల్గొన్నారు.
తడ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ ప్రదర్శనలు
రవి కిరణాలు న్యూస్ తడ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం లో జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం తడ బాలికోన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో తమ మేధస్సు ప్రతిభతో మిళితం చేసి సైన్స్ ప్రదర్శనలు చేశారు.
పాఠశాల ప్రాంగణంలో సైన్స్ డే పురస్కరించుకుని పలువురు విద్యార్థిని బృందం ప్రదర్శించిన ప్రదర్శనలో వివిధ రకములైన సైన్స్ ప్రదర్శనలు అద్భుతంగా కనపరిచారు వీళ్లందరినీ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మెచ్చుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కరుణశ్రీ, సురేఖ, నాగదేవి, రమాదేవి లతోపాటు వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు.