వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమని సంకేతం ఇస్తోంది?
ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. అభ్యంతరకర వ్యాఖ్యలుంటే నిలువరించడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉన్నాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల పై దాడులు, ఆస్తుల విధ్వంసం, వ్యక్తిగత భౌతిక దాడులకు పాల్పడడం చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంకేతాన్ని ఇస్తుందో ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎంతకైనా తెగిస్తాం అంటూ ప్రజల్లో భయాందోళనలు రేకిత్తించడమే ఈ ప్రభుత్వం ఉద్దేశమా? గతంలో మంగళగిరిలోని మా జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ నిరసనకు సిద్ధమవుతోన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కార్యాలయంలోకి పోలీసు బలగాలతో చొరబడి ఈ ప్రభుత్వం నిలువరించడం జరిగింది. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలోకి రౌడీమూకళ్ళా చొరబడి దాడులకు తెగబడడం పార్టీలకతీతంగా ఖండించాల్సిన విషయం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోక పోతే రాష్ట్రం అరాచకంగా మారే అవకాశాలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ అంశాల్లో కఠినంగా వ్యవహరించకపోతే రానున్న రోజులు మరింత దారుణంగా మారుతాయి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నెల్లూరులో వైసీపి కార్యకర్తలు టిడిపి కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. మంగళగిరి టిడిపి కార్యాలయంలో పట్టాభి విలేకరుల సమావేశం అనంతరం ఆ కార్యాలయంపై జరిగిన దాడి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో టిడిపి కార్యాలయాల వద్ద వైసీపి నేతలు ఆందోళనలు చేపట్టారు. నెల్లూరులో ముందుగానే పసిగట్టిన టిడిపి నేతలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముందుగానే పోలీసులు టిడిపి కార్యాలయం వద్దకు చేరుకుని బారీకేడ్లు ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది వైసీపి కార్యకర్తలు అక్కడకు చేరుకుని బారీకేడ్లను తోసుకుని టిడిపి కార్యాలయం ప్రధాన గేటు వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని దూరంగా నెట్టుకుంటూ తీసుకెళ్లారు. తర్వాత వైసీపి కార్యకర్తలు నినాదాలు చేయగా... అప్పుడే అక్కడికి చేరుకున్న టిడిపి కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన పోలీసులు వైసీపి కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి దారుణం – దాడుల విషయంలో పోలీసులు, సీఎం లాలూచీ పడ్డారు – ప్రభుత్వ ప్రమేయంతోనే దాడులు జరిగాయి – పార్టీ కార్యాలయంపై దాడిని జీవితంలో ఎప్పుడూ చూడలేదు – పార్టీ కార్యాలయం.. రాజకీయ పార్టీలకు దేవాలయం లాంటిది – డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు – డీజీపీ కార్యాలయం పక్కనే దాడి జరిగితే నిఘా విభాగం ఏం చేస్తోంది - ప్రణాళిక ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగపడ్డారు - అనేకచోట్ల వ్యవస్థీకృతంగా దాడులు చేస్తున్నారు – ముఖ్యమంత్రి, డీజీపీ కలిసే ఈ దాడి చేయించారు – అనేక రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు – రాష్ట్రంలో గంజాయి సాగు పెరుగుతోందని అందరూ చెప్పారు – రేపు రాష్ట్ర బంద్ పాటిస్తున్నాం – ఈ దాడులు.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం – మమ్మల్ని భయబభ్రాంతులకు గురి చేస్తారా? – ప్రజల పన్నుతో జీతం తీసుకునే డీజీపీ నేరస్థులతో లాలూచీ పడతారా? – రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం – రాష్ట్రంలో 356 అధికరణం ఎందుకు ప్రయోగించకూడదు? – ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి – ఇంతకన్నా ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుంది – ప్రజల పన్నుతో జీతం తీసుకునే డీజీపీ నేరస్థులతో లాలూచీ పడతారా? – డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్నా మా ఆఫీసుకు భద్రత లేదు - కరెంటు ఛార్జీలను ఇష్టం వచ్చినట్లు పెంచుతారా? – డ్రగ్ మాఫియాకు మీరు వత్తాసు పలుకుతారా? – ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం చేద్దాం – ప్రజాస్వామ్యంపై దాడి చేసే శక్తులపై పోరాటం చేద్దాం – రౌడీలతో రాజకీయాలు చేస్తారా? – ఫోన్ చేసినా డీజీపీ ఎత్తలేదు – గవర్నర్, కేంద్రమంత్రి ఫోన్ ఎత్తారు.. డీజీపీ ఎత్తరా? –కొందరు చేసే పనులతో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టింది – ఇన్నాళ్లూ తిట్టారు, జైలులో పెట్టారు.. ఇప్పుడు కొడతారా? – హెరాయిన్ గురించి మాట్లాడితే ఏం తప్పు? – ఏపీలో గంజాయి సాగు ఉందని పక్క రాష్ట్రాల డీజీపీలు చెప్పారు – గంజాయి సాగు పెరిగిందని టీడీపీ నేతలు అనడమే తప్పా? : టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పై వైకాపా నేతల దాడి అనాగరిక చర్య -- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పై ఈరోజు సాయంత్రం వైకాపా రౌడీ మూకలు భౌతిక దాడి, ఆస్తుల విధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ,ప్రతిపక్ష నేత గా, జడ్ ప్లస్ కేటగిరి రక్షణ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై కూడా గత నెలలో దాడికి పాల్పడ్డారు.
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా ! లేక తాలిబన్ల పాలనలో ఉన్నామా ! అన్న సందేహం లో రాష్ట్ర ప్రజలు ఉన్నారు.
టిడిపి కార్యాలయం పై దాడితో రాష్ట్రం లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన పార్టీ కార్యాలయాలకు ఉన్న రక్షణ ఏ పాటిదో అర్థం అవుతోంది.
ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా గా జిల్లా కేంద్రాల్లో ఉన్న టిడిపి కార్యాలయాలపై దాడి కి పాల్పడటం అమానుషం.
వైసీపీ ప్రభుత్వం లో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిద్రాణ దశ లో ఉంది.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షం కు ఉంది, విమర్శలు చేశారన్న కారణం తో దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం?
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై ప్రభుత్వ పరోక్ష సూచనలతో దాడులు జరిగాయా?
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిని వైకాపా అల్లరిమూకలు ధ్వంసం చేయడం దుర్మార్గం
టిడిపి నాయకులు , టిడిపి కార్యాలయాల పై దాడులతో వైసీపీ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోంది.
రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన
టీడీపీ నేత పట్టాభి నివాసంపై దాడిని ఖండిస్తు గూడూరులోనిరసనలు
ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం
నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి
ప్రజాస్వామ్యంలో ఏమిటి ఈ రాక్షసతత్వం
ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి
మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆగ్రహం
ఆంధ్రప్రభ✍️మీజూరు మల్లి✍️: టీడీపీ నేత పట్టాభి నివాసంపై దాదాపు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం హేయమైన చర్యలు అనిమాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ధ్వజమెత్తారు, మంగళవారంటీడీపీ నేత పట్టాభి నివాసంపైదాడిని ఖండిస్తు గూడూరు లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు, ఎన్టీఆర్ విగ్రహానికిప్రజాస్వామ్య న్నీ రక్షించాలి అని వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూటీడీపీ నేత పట్టాభి నివాసంపై దాదాపు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో పాటు విలువైన వస్తువులను కూడా ధ్వంసం చేశారు అని తెలిపారు.
దాడి సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో పట్టాభి ఉన్నారు అని తెలిపారు. పట్టాభి ఇంటిపై దాడిజరిగిందని పట్టాభికి భార్య, కూతురు ఫోన్ చేసి చెప్పారు. వైసీపీ నేతలే దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు. గంజాయి వ్యవహారంపై మంగళవారం టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి వైసీపీ నేతలపై పట్టాభివిమర్శలుచేశారు. ఘటనాస్థలిలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు అని. దాడి సమయంలో ఇంట్లో కేవలం పట్టాభి ఐదేళ్ల కూతురు, పనిమనిషి, డ్రైవర్ ఉన్నారు. దాడి జరుగుతుండగా పట్టాభి కూతురిని బాత్‌రూమ్‌లో దాచిన పని మనిషి డ్రైవర్ మెడపైకత్తిపెట్టిచంపేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది అన్నారు.
వెంటనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవాలి డిమాండ్ చేశారు, ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు కొండూరు వెంకటేశ్వర్లు రాజు, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రథినిధి బిల్లుచెంచురామయ్య, తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి, కార్యదర్శి గుండాల భారతి, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఇస్రాయెల్ కుమార్, నియోజకవర్గ ఎస్సి సెల్ అద్యక్షులు ఏసుపాక పెంచలయ్య,మండల కమిటీ సభ్యులు పెంచలరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, నారాయణ రెడ్డి,రంగా రెడ్డి, కృష్ణ రెడ్డి,నాగూర్, మండల ఎస్సి సెల్ అద్యక్షులు బట్టేపాటి కృష్ణయ్య, మండల మహిళా కమిటీ అద్యక్షులు మల్లి శ్యామల,టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై వైసీపీ గూండాల దాడిని ఖండించిన మాజీ మంత్రి సోమిరెడ్డి
పట్టపగలు టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు, ఆస్తుల విధ్వంసం జరుగుతుంటే ఈ రాష్ట్రం ఎక్కడికిపోతోంది..
సాక్షాత్తు డీజీపీ కార్యాయాలనికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు..
రాష్ట్ర వ్యాప్తంగా నేతల ఇళ్లపైన, కార్యాలయాలపై దాడులు, భౌతిక దాడులు జరుగుతుంటే పోలీసులు స్పందించరా..
మా పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడిన దాంట్లో మీకు అభ్యంతరం ఉంటే కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టుకోండి..ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా..లీగల్ గా ప్రొసిడీ అవ్వండి..
మీరు దీనికే ఇంతలా విధ్వంసం సృష్టిస్తే రెండున్నరేళ్లుగా మీరు, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ బాబు మీద, మా మీద, మా కుటుంబాలపై వాడిన నీచాతినీచమైన భాషకు మేం కత్తులు, కర్రలు ఎత్తుకుని వీధుల్లోకి రావాలా..
ఈ రోజు జరిగిన ఘటనలు వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలకు పరాకాష్ట
నక్కా ఆనందబాబు మాట్లాడింది నూటికి నూరు శాతం వాస్తవం..
ఏపీలోని గంజాయి స్థావరాలపై తమిళనాడు, తెలంగాణ పోలీసులు దాడులు చేస్తుంటే ఇక్కడి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి..
గంజాయి, మత్తు పదార్థాలపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి ఒక ప్రెస్ మీట్ గురించి ఇంత విధ్వంసం సృష్టిస్తారా..
దేశంలోనే ఆంధ్రుడని చెప్పుకునేందుకే ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తెస్తున్నారు..
వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, దుర్మార్గాలపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది..