నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ పరిధిలోని శెట్టిగుంటరోడ్డు నందు ఐలాండ్ సుందరీకరణ పనులను, అక్కడే ఏర్పాటు చేసిన స్వచ్చ మాత (శానిటరీ వర్కర్) విగ్రహాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ దినేష్ కుమార్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు మద్దినేని శ్రీధర్, కిన్నెర మాల్యాద్రి, అడపా శ్రీధర్, బి.సత్యకృష్ణ, వంశీ, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అన్యాయం జరిగే జీవో నెంబర్ 55,77 లను వెంటనే రద్దు
చేయాలని : ఎబివిపి
ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు.
శుక్రవారం ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక గూడూరు రెండో పట్టణ పరిధిలో మాలవ్యా నగర్ సెంటర్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ జిల్లా కన్వీనర్ కార్తీక్ మాట్లాడుతూ ప్రభుత్వం, విద్య ఉన్నతాధికారుల అనాలోచిత చర్యల వలన గ్రామీణ పేద, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అంగడిలో సరుకు మాదిరిగా తయారు చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను శాశ్వతంగా దూరం చేసే ఈ దుర్మార్గపు జీవోలు ప్రభుత్వం తేవడం కుట్ర పూరితమని అన్నారు. జీవో 55 ఫలితంగా డిగ్రీ కాలేజ్ లో ఉన్న సీట్లలో కేవలం 70 శాతం కన్వీనర్ కోటాలో భర్తీ చేసి మిగిలిన 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తే అది పేద విద్యార్థుల పట్ల గుదిబండగా మారుతుందనడంలో సందేహం లేదని అన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాల విద్యార్థులకు తీవ్రంగా నష్టం చేసే ఈ జీవోలో ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు. అలా కాని పక్షంలోరాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలియజేశారు. జీవో నెంబర్ 77 వలన ప్రైవేట్ కళాశాలలో చదివే పీజీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన రాదు అని జీవో నెంబర్ 77 జారీ చేయడం వలన అనేక మంది పేద విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందిగా మారిందని పాదయాత్ర ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తాము అని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు జీవో నెంబర్ 77 తీసుకురావడం అన్యాయమని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్ర ఉద్యమం తీసుకొస్తామని వారు హెచ్చరించారు ఈకార్యక్రమంలో జిల్లా హాస్టల్ సమీర్ చిన్న, నగర కార్యదర్శి కార్తీక్ ఏబీవీపీ నాయకులు గోకుల్, ప్రదీప్, కిరణ్, నవీన్ సందీప్ , ఋగ్వద్, ఎస్ రాజ్ కుమార్ తదితరులు
దొరవారిసత్రం మండలం ఎంపీడీవో కార్యాలయము నందు వైయస్సార్ ఆసరా 2 విడత సంబరాల్లో భాగంగా గా ఆసరా 598 పొదుపు సంఘాలకు రూ 4.46 కోట్లు బ్యాంకు రుణాలు134 సంఘాలకు కోట్లుచెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో DRDA.పిడి సాంబశివారెడ్డి మండల ఉపాధ్యక్షుడు దువ్వూరు గోపాల్ రెడ్డి ,ఎంపిడిఓ సింగయ్య, AC వసుంధరాదేవి, APM రాజారెడ్డి, CC లు ,VOA లు లు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు
ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యంచేయవద్దు-(ఎస్ఎఫ్ ఐ )
కావలి జవహర్ భారతి కళాశాలల గేట్ వద్ద ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చెయవద్దని కోరుతూ శనివారం ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేసారు.ఈసందర్భంగా ఎస్ ఎఫ్ ఐజిల్లాఅధ్యక్షుడు సనత్ మాట్లాడుతూ "ఎయిడెడ్,విద్యాసంస్థలను నిర్యిర్యం" చేసేందుకు రాష్ట్రప్రభుత్వంగతనెల10వ తేదీన జి.వో.నెం42ను తీసుకుని వచ్చి, టీచింగ్ నాన్ టీచింగ్ లెక్చరర్స్ ను పూర్తిగాసుమారు10200మందిని ఇతర ప్రభుత్వ సంస్థలకుమార్చివేసారని తెలిపారు.దీనివలన ఆ సంస్థలో చదువుతున్న విద్యార్థులు, అధ్యాపకులను, బోధ నేతరసిబ్బందికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందన్నారు. కావలిలో చరిత్ర లొ ప్రసిద్ధి చెందిన జవహర్,భారతి,విశ్వోదయ కాలేజీఉందన్నారు దిన్ని ప్రభుత్వం వెంటనే ఎయిడెడ్ విద్యాసంస్థలా గా కొనసాగించాలని డిమాండ్,చేశారు.ఈకార్యక్రమంలోపూర్వవిద్యార్దులు కల్లయ్య మాట్లాడుతు, జవహర్ భారతి ఎయిడెడ్ కళాశాలలో అనేక మంది పేదవిద్యార్థులుచదువుకోని ఉన్నత స్థాయికి వెళ్లారన్నారు. జవహర్ భారతికళాశాలలనుమరియు విశ్వదయ పాఠశాలలనుఎయిడెడ్, గా కొనసాగించాలనిడిమాండ్ చేశారు. ఆకాలేజీ లోపేదవిద్యార్థులకుచదువుకొనేఅవకాశంకల్పించాలిఅనికోరారు.ఈకార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులుప్రణయ్ ,ఆర్ .మల్లికార్జున్,శివ,ఎస్.ఎఫ్. ఐ. జవహర్ భారతికాలేజీ పూర్వవిద్యార్థులువేంకటరమణయ్య,,టి.మాల్యాద్రి,కె.మాల్యాద్రి,జి.మధుసూదన రావు,గోపసానిఅశోక్,తదితరులు పాల్గొన్నారు.
"బద్వేల్ లో భారీ మెజారిటీ సాధిద్దాం" - కాకాణి.
వై.యస్.ఆర్.కడప జిల్లా, బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు, బూత్ కమిటీ కన్వీనర్లు, బూత్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.