వాకాడు... చిట్టమూరు మండల పరిషత్ అధ్యక్షురాలు విజయలక్ష్మి తనయుడు వైకాపా మండల కన్వీనర్, సీనియర్ నేత సన్నా రెడ్డి. శ్రీనివాస రెడ్డి, ఆధ్వర్యంలో చిట్టమూరు మండలం జడ్పిటిసి, ఎంపీటీసీలు, వైకాపా నాయకులు కార్యకర్తలు కోలాహాలంగా తిరుపతి, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు నేదురుమల్లి. రామ్ కుమార్ రెడ్డి కి శాలువా కప్పి పూలమాలవేసి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ మేరిగ. మురళి కి శాలువా కప్పి పూలమాలవేసి సత్కరించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి. రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేసి మంచి విజయాన్ని సాధించి పేరు తీసుకు వచ్చినందుకు ఆయన అభినందించారు. పార్టీ లో గెలుపొందిన వారు ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలియజేయాలన్నారు. మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు. దామోదర్ రెడ్డి, వాకాడు ఉపసర్పంచ్ పాప రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ష నీల్ రెడ్డి, నాగూర్ రెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, భార్గవ్ రామ్, వా కాటి రవికుమార్, పాప రెడ్డి. శశి రెడ్డి,చిట్టమూరు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రెండో విడత వైయస్సార్ ఆసరా పథకంలో భాగంగా నెల్లూరు నగరంలోని విజయమహల్ గేట్ సమీపంలో గల ఎం.సి.ఆర్. కళ్యాణ మండపంలో లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు రూ.17.44 కోట్ల చెక్కును జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారితో కలిసి పంపిణీ చేసారు. వైయస్సార్ ఆసరా పథకంలో భాగంగా జిల్లాలో వేలాది మందికి లబ్ధి చేకూరుతుందనన్నారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పి. రూప్ కుమార్ యాదవ్, ఏ.పి. ఆగ్రో డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొణిదల సుధీర్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.
శ్రీసిటీని సందర్శించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు
రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీసిటీ) : కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఐఏఎస్, శనివారం విడివిడిగా శ్రీసిటీని సందర్శించారు.
దుర్గా శంకర్ మిశ్రాకు శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రత్యేకతలు, ప్రగతి మరియు ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధిపై దాని ప్రభావం గురించి ఆయనకు వివరించారు. అనంతరం శ్రీసిటీ పరిసరాలను మిశ్రా సందర్శించారు మరియు కొన్ని పరిశ్రమలకు వెళ్ళి అక్కడ ఉత్పత్తులను, ఇతర పనులను పరిశీలించారు. విశాల స్థలం, మంచి మౌళిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, భారీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సిటీని అభివృద్ధి చేయడంలో శ్రీసిటీ యాజమాన్యం చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు.
శ్రీసిటీకి విచ్చేసిన పోలా భాస్కర్ కు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఘనస్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ఆయన క్రియా యూనివర్సిటీని సందర్శించారు. క్రియా వైస్ ఛాన్సలర్ డాక్టర్ మహేశ్ రంగరాజన్, గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మరియు స్కూల్ ఆఫ్ ఇంటర్‌వూవెన్ ఆర్ట్స్ & సైన్సెస్ విభాగాల ముఖ్య అధ్యాపకులతో ఆయన చర్చించారు. క్రియా విద్యావిధానం, పాఠ్యాంశాల గురించి వివరించిన వైస్ ఛాన్సలర్, కళలు శాస్త్రాలను మిళితం చేసిన ఒక ప్రత్యేకమైన ‘ఇంటర్‌వొవెన్ లెర్నింగ్’ విధానం విద్యార్థులకు అన్వేషణ శక్తిని, సబ్జెక్టులపై ఆసక్తిని పెంచుతుందన్నారు.
క్రియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు కృతజ్ఞతలు తెలిపిన పోలా భాస్కర్, ఉన్నత విద్యలో భిన్నమైన విధానాన్ని తీసుకువచ్చినందుకు యూనివర్సిటీ బృందాన్ని ప్రశంసించారు - ఇంటర్‌వూవెన్ లెర్నింగ్ ద్వారా ఆలోచనలు, కళలు, విజ్ఞానాలతో గతాన్ని నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తు కోసం విద్యార్థులను సంసిద్దులను చేస్తుందన్నారు.
వార్డు నెంబర్లకు శిక్షణ తరగతులు.... వాకాడు... మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీలకు చెందిన వార్డు మెంబర్లకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి హాజరై ఈ శిక్షణ వార్డు మెంబర్లకు ఎంతో ఉపయోగ పడుతుంది అన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గత ప్రభుత్వం వల్ల వచ్చిన ఆదాయం మాత్రం కావాలా!గత ప్రభుత్వ బకాయిలు మాత్రం చెల్లించరా!ఉపాధిహామీ మిగిలిన బిల్లులు, నీరు,చెట్టు బిల్లులు తో పాటు గృహనిర్మాణ బకాయిలు చెల్లించే వరకూ తెలుగుదేశం పార్టీ న్యాయపోరాటం చేస్తుంది.
ఉదయగిరి లో జరిగిన ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలోతెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఉదయగిరి మాజీ శాసనసభ్యుడు బాలినేని రామారావు గార్లతో కలిసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వం వల్ల వచ్చిన ఆదాయం మాత్రం తీసుకుంటూ, గత ప్రభుత్వంలో పనులు చేసిన వారికి చెల్లించవలసిన బకాయిలు మాత్రం చెల్లించడము లేదు.
కేంద్ర ప్రభుత్వ నిధులైన ఉపాధిహామీ నిధులతో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా, వాటిని పనులు చేసిన వారికి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించింది.
తెలుగుదేశం పార్టీ చేసిన న్యాయపోరాటం ఫలితంగా హైకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వారికి బిల్లులు చెల్లిస్తుంది.
నీరు- చెట్టు తో సహా ఇతర నిధులతో గత ప్రభుత్వం హాయములో పనులు చేసి బిల్లులు రానివారికి చివరి పైసా వచ్చే వరకు న్యాయపోరాటం చేయాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి, దనికొరకు అవసరమైన సమాచారం సేకరించడము కోసం మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలోను,నెల్లూరు లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయములోను ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు.
కావున గత ప్రభుత్వం లో పనులు చేసి బిల్లులు రాని వారు,గత ప్రభుత్వ హయాంలో ఇల్లులు కట్టుకొని బిల్లులు రాని వారు తమ దగ్గర ఉన్న ఆధారాలను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయములో అందచేస్తే వారికి బిల్లులు వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని అన్నారు.
ఈ సమావేశంలో నుడా మాజీ డైరెక్టర్ ఖాజావలి,తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి రాపూరు సుందరరామిరెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి సురేంద్రబాబు మరియు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
స్టేట్ బ్యాంక్ రుణ సేవలు వినియోగించుకోవాలి
కావలి ఆర్ డి ఒ శ్రీ నూ నాయక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ బ్రాంచ్ నిర్వహిస్తున్న మెగా రుణమేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆర్ డి ఒ శ్రీ నూ నాయక్ కోరారు. రామ్మూర్తి పేట లో ని యస్ బి ఐ వద్ద శుక్రవారం నిర్వహించిన మెగా రుణమేళాను ఆయన ప్రారంభిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న రుణ సదుపాయం వారి జీవన అభివృద్ధి కి సహకరిస్తుండడం అని అభినందించారు.
కావలి ఆర్ డి ఒ శ్రీ నా నాయక్ జ్యోతిప్రజ్వ లనతో ప్రారంభించిన
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి రీజినల్ మేనేజర్ పవన్ కుమార్ మాట్లాడుతూ ఏ బ్యాంకు కల్పించని విధంగా తక్కువ వడ్డీకి రుణ సౌకర్యం అందుబాటులోకి తెచ్చిందని అన్నా రు. . కావలి మూడు బ్రాంచిల మేనేజర్లు మల్లికార్జున రెడ్డి, ప్రవీణ్ కుమార్,ఈశ్వరాచారి నేతృత్వంలో నిర్వహించిన రుణమేళాకు భారీ ఎత్తున స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని హౌసింగ్ లోన్ కౌన్సిలర్స్ కిరణ్ కుమార్, వెంకయ్య, ప్రకాష్ రావు, తదితరులు పర్యవేక్షించారు