రవికిరణాలు :
ఏపీ విపత్తుల శాఖ
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘గులాబ్’ తుపాన్
గోపాలపూర్ కు 140 కిమీ, కళింగపట్నానికి 190 కిమీ దూరంలో కేంద్రీకృతం
ఆదివారం అర్ధరాత్రి కళింగపట్నం - గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం
ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు
ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 - 95 కీమీ వేగంతో బలమైన ఈదురగాలులు
ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
-కె.కన్నబాబు. కమిషనర్ విపత్తుల శాఖ.
రవికిరణాలు నెల్లూరు:
నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 12వ డివిజన్, చింతారెడ్డి పాలెంకు చెందిన మాజీ సంచారజాతుల కార్పొరేషన్ డైరెక్టర్ రాజారత్నం వీరి మిత్రబృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రవికిరణాలు నెల్లూరు :
నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 39వ డివిజన్ కు చెందిన యువ నాయకులు జమీర్ వీరి మిత్రబృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీలో కొత్తగా చేరినవాళ్ళు,మొదటి నుండి పార్టీకోసం కష్టం చేసిన వారు అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలని ప్రతీ గడపకూ చేరేలా పని చేయాలి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరిని కలుపుకునిపోతూ అభివృద్ధి మరియు సంక్షేమమే అజెండాగా ముందుకు సాగుతాం . రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిండి సురేష్ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రవికిరణాలు నెల్లూరు :
కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం, పార్లపల్లి గ్రామంలో క్యాన్సర్ వ్యాధి బాధపడుతున్న పి.భాగ్యమ్మ కు రూ.25,000 పెరాలసిస్ తో బాధపడుతున్న ఎల్లు శ్రీనివాసులు రూ. 20,000 మొత్తం 45,000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెల్లూరు లోని తన నివాసంలో అందజేసిన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు
నెల్లూరు జిల్లాలోని జడ్పిటిసి స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలోని 46 జడ్పిటిసి స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసామని గర్వ పడకుండా అన్ని సామాజిక వర్గాలకు సమతూకం పాటించి పదవులు అప్పగించామని కాకాని పేర్కొన్నారు.... రాజకీయ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరూ పదవి ఆశించడం జన్మ హక్కు అన్నారు...
నెల్లూరు జిల్లాలో మొత్తం 46 మండలాలకు సంబంధించి 44 మండలాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఎంపీపీగా పదవులు చేపట్టారన్నారు. మిగిలిన రెండు మండలాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే పదవి కోసం ఎక్కువ మంది ఆశించడం వల్ల ఇరువురు నేతలను సమన్వయం చేసి ఆ రెండు ఎంపీ స్థానాల్లో ఏర్పడిన సమస్యను కూడా పరిష్కరిస్తామని అన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వారు పదవిని ఆశించడంలో తప్పు ఏమీ లేదన్నారు
10 లక్షలతో ఆధునీకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అనిల్
రవికిరణాలు నెల్లూరు :
నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ వెంకటేశ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రూ. 10 లక్షలతో ఆధునీకరించిన అర్బన్ హెల్త్ సెంటర్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు దేవరకొండ అశోక్, తదితరులు పాల్గొన్నారు.