నూతనంగా ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ ద్వారా ప్రతీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి పూర్తి వివరాలను నమోదు చేసేందుకు అవకాశముందని నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ గోపి పేర్కొన్నారు. మొబైల్ యాప్ నిర్వహణపై వార్డు అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శులకు అవగాహనా సదస్సును సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ వార్డు వలంటీరు పరిధిలోని ఆయా ఇండ్లలో మొబైల్ యాప్ ను వినియోగించి కుటుంబ సర్వే చేపడతారని, సర్వే ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, పేర్లలో అక్షర దోషాలు వంటి వివిధ అంశాలను నమోదు చేస్తారని తెలిపారు. నగర పాలక సంస్థ ద్వారా మొత్తం మూడు వేల మొబైళ్లను ఇప్పటివరకు వార్డు వలంటీర్లకు అందజేసి అన్ని డివిజనుల్లో సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. మొబైల్ యాప్ ద్వారా వార్డు వలంటీర్లు, వార్డు కార్యదర్శుల దైనందిన హాజరు నమోదు కూడా అమలు చేయనున్నామని అడిషనల్ కమిషనర్ వివరించారు.
నెల్లూరు, పిబ్రవరి 11, (రవికిరణాలు) : “మూర్చకు మోక్షం" అనే నినాదంతో మూర్చవ్యాధికి ఆధునిక శస్త్రచికిత్సలను అందుబాటులోనికి తీసుకుని వచ్చి, ఒకే సంవత్సరంలో దేశంలోనే అత్యధిక, విజయవంతమైన శస్త్రచికిత్సలు నిర్వహించిన హాస్పిటల్ గా నారాయణ హాస్పిటల్ ప్రత్యేక ఘనతను సాధించింది. మూర్ఛవ్యాధిగ్రస్తులు చాలా మంది సమాజంలో స్వేచ్చగా తిరగలేక, మానసికంగా కృంగిపోతుంటారు. కారణం ముర్చవ్యాధి సమయం, సందర్భం ముందస్తు హెచ్చరికలు లేకుండా హఠాత్తుగా వస్తుంది. మూర్చవ్యాధి గ్రస్తులకు వివాహం చేయాలన్నా, ఉన్నత చదువులు చదవాలన్నా, దూర ప్రయాణాలు చేయాలన్నా, చేయలేక సమాజంలో మానసిక వికలాంగులుగా మిగిలిపోతుంటారు. క్రమం తప్పకుండా మందులు వాడటం కూడా కొంత మందికి ఆర్థిక భారం వలన వీలు కాక మరణాలు సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ సమస్యను సమూలంగా రూపుమాపి, సరికొత్త వైద్య విధానంతో నారాయణ న్యూరో సైన్సెస్ విభాగం శ్రీకారం చుట్టింది.నారాయణ న్యూరాలజి విభాగాధిపతి డాక్టర్ ఎన్.ఎస్. సంపత్ కుమార్ నేతృత్వంలో ఎపిలెప్సీ స్పెషలిస్ట్ డాక్టర్
రావిష్ కెన్ని రాజీవ్, న్యూరోసర్జన్ల బృందం ఈ శస్త్రచికిత్సలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దక్షిణ భారతదేశంలో నారాయణ హాస్పిటల్ లో మాత్రమే అందుబాటులో గల 64 ఛానల్ వీడియో ఇ.ఇ.జి, 3 టెస్లా ఎమ్మారై, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక యంత్ర పరికరాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ల సహకారంతో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగింది. ఈ శస్త్రచికిత్సల కోసం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 300 మందికి పైగా మూర్చవ్యాధిగ్రస్తులు వైద్య చికిత్సల కోసం రాగా వారందరికి ఎమ్మారై వంటి ఖరీదైన పరీక్షలతోపాటు సుమారు రూ.16,000 పైగా విలువైన వైద్య పరీక్షలు, సేవలు ఉచితంగా అందించడం జరిగింది. ఈ 300 మందిలో 42 మందికి శస్త్రచికిత్సలు అవసరమని డాక్టర్ సంపత్ కుమార్ బృందం నిర్ధారించింది. అందులో ఇప్పటి వరకూ 11మంది పురుషులు, 10 మంది మహిళలు మొత్తం 21 మందికి డా॥ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించి, 100 శాతం విజయవంతమయ్యేలా కృషిచేశారు. శస్త్రచికిత్స చేయించుకున్న వారిలో 14-48 సం||ల మధ్య వయస్సు కలిగిన వారు ఉండడం గమనార్హం.ఈ అంతర్జాతీయ మూర్చదినం మూర్చవ్యాధిగ్రస్తులందరికీ ఒక శుభదినంగా భావించవచ్చు. శస్త్రచికిత్స చేయించుకున్న అందరూ కూడా సాధారణ జీవితం గడుపుతూ తమతమ కుడుంబాలలో ఆరోగ్య వెలుతురులు
నింపారు. నారాయణ న్యూరోసైన్సెస్ విభాగంలోని ఈ ఎపిలెప్సీ బృందం, పరికరాల సహకారంతో మూర్ఛరహిత సమాజం కోసం కృషిచేసి ఆరోగ్యకరమైన స్వతంత్ర జీవితాలు మూర్ఛరోగులు గడిపేందుకు కృషిచేస్తుంది. మూర్ఛవ్యాధి పై ప్రజలకు అవగాహన కలిగించి 80% కు పైగా మూర్ఛవ్యాధిగ్రస్తులను మందులతోనే నయంచేసే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నారాయణ న్యూరోసైన్సెస్ విభాగం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుందని డా ఎన్.ఎస్. సంపత్ కుమార్ తెలిపారు.
నెల్లూరు, పిబ్రవరి 11, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.ఎమ్మెల్యే కాకాణికి ఘన స్వాగతం పలికిన రైతులు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అందరం కోరుకొని, అందరం కలసి మహానేత రాజశేఖర్ రెడ్డి పాలనను తిరిగి తెచ్చుకోవడం జరిగింది. రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా చేయూత ఇస్తున్నారు.గతంలో పనిచేసిన చంద్రబాబు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశాడు.రైతులు పండించిన
అపరాల సాగులో రైతులు నష్టపోతున్నారని నా దృష్టికి వచ్చింది.ఎక్కడా రైతులకు ఇబ్బందులు లేకుండా ఇన్ పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు న్యాయం చేస్తాం. గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అవసరమైనన్ని ఏర్పాటు చేయకుండా, మద్దతు ధర కల్పించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.గత ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందని పలువురు అధికారులు కూడా చెప్పడం ఆశ్చర్యకరం!.కానీ ప్రస్తుతం రైతులు
ఎక్కడా ఇబ్బందులు పడకుండా ఉండేలా ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన వాటిని ఇంటి వద్దకే చేరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులు నష్ట పోకుండా మద్దతు ధరను కల్పిస్తున్నారు.రైతులకు ఇబ్బందులు లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. సాగునీటి విషయంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా కండలేరు ఎడమ కాలువ ద్వారా 23 వేల ఎకరాలకు సమృద్ధిగా సాగు నీరు అందించడం జరుగుతుంది.గత ప్రభత్వంలో మాదిరిగా సాగునీటి రాజకీయాలకు తావు లేకుండా సాఫీగా సాగునీటిని అందించాము.ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసి, వాటికి స్థానిక శాసన సభ్యులను గౌరవ అధ్యక్షులుగా నియమిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి ది. కొందరు ఈ ప్రభుత్వం పై దుర్మార్గపు అసత్య ఆరోపణలు చేస్తున్నారు.రేషన్, పింఛన్ల విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత నాది.
గతంలో అభివృద్ధి చేసారంటూ శంకుస్థాపన రాళ్లు వేశారు తప్ప, అభివృద్ధి జరగని
పరిస్థితి.కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ప్రాంతంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది.పెద్దలు ఆనం రామనారాయణరెడ్డి, మా తండ్రి రమణారెడ్డి చొరవతో కండలేరు ఎడమకాలువ రావడం జరిగింది. గతంలో ఇక్కడ వ్యవసాయ మంత్రిగా పనిచేసిన వ్యక్తి నిర్లక్ష్యం వలన సాగు నీటి విషయంలో రైతులు ఇబ్బందులు పడ్డారు.రైతులను మోసం చేస్తే వాళ్ల ఉసురు తగులుతుంది.నేను గత 5 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని ఈ 5 సంవత్సరాలు10 సంవత్సరాల అభివృద్ధి చేస్తాను.రైతులు హర్షించే విధంగా అభివృద్ధి పనులు చేసి, రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటాను.
- ప్రతీ 6 డివిజన్లకు ఒక రిటర్నింగ్ అధికారి కేటాయింపు
- కమిషనర్ పివివిస్ మూర్తి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నగర పాలక సంస్థ పరిధిలోని 54 డివిజన్లలో చేపట్టిన పునర్విభజన ప్రక్రియలో సవరణలను సూచిస్తూ 22 ఫిర్యాదులు/ సలహాలు అందాయని, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది పర్యవేక్షణలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టి వాటికి పరిష్కారాలు అందిస్తున్నామని కమిషనర్ పివివిస్ మూర్తి ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో కమిషనర్ మాట్లాడారు. కమిషనర్ & మున్సిపల్ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశాలకు అనుగుణంగా నగర పాలక సంస్థ పరిధిని 54 డివిజన్లుగా విభజించి, 9 క్లస్టరు విభాగాలుగా, 424 పోలింగ్ స్టేషన్లతో కూడిన జాబితాను విడుదల చేశామని తెలిపారు. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల జాబితాను రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచామని, నగర పాలక సంస్థ వెబ్ సైట్ ద్వారా కూడా వివరాల నమోదును ఓటర్లు పరిశీలించుకోగలరని కమిషనర్ సూచించారు. మొత్తం 54 డివిజన్లలో 2,33,767 మంది పురుష ఓటర్లు, 2,44,374 మంది స్త్రీ ఓటర్లు, 77 మంది ఇతరులుగా మొత్తం 4,78,218 ఓటర్ల సంఖ్యను తుదిదశ జాబితాగా విడుదల చేశామని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతీ 6 డివిజన్లకు ఒక రిటర్నింగ్ అధికారిని కేటాయించామని, ఎన్నికల నిర్వహణలో ఆయా పరిధిలోని డివిజన్లకు సంబంధించి అన్ని ఫిర్యాదులు/సలహాలను అధికారి దృష్టికి తీసుకెళ్లాలని కమిషనర్ సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం నిర్వహణా ప్రక్రియను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు సిబ్బంది సన్నద్ధంగా ఉన్నామని కమిషనర్ వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం నవశకం పేరుతో ఉగాది నాటికి పేదలకు అందించాలనుకున్న నివేశ స్థలాలను స్థానికులకు కేటాయించాకే పొరుగు గ్రామాలవారికి ఇవ్వాలని కోట మండలం చిట్టేడు గ్రామస్తులు కోరారు.. ఈ మేరకు కోట తహసీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి, తహసీల్దారు మల్లికార్జున రావుకు వినతి పత్రాన్ని అందించారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కోట మండలం మైక్రోటవర్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన లే అవుట్ లో కోట, వెంకన్నపాలెం, తిమ్మానాయుడు పాలెం గ్రామాల ప్రజలకు ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించినట్లు తెలిసిందన్నారు,, అయితే తమ గ్రామంలో నివేశ స్థలాలు లేక ఒకే కుటుంబంలో 300 పైగా నిరాశ్రయులైవున్నారని తెలిపారు.. ఇదిలా ఉండగా గ్రామంలో ఖాలీగావున్న ప్రభుత్వ స్థలాన్ని ఇండోర్ స్టేడియం కొరకు కేటాయించినట్లుగా అధికారు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన లే అవుట్ లో స్థాలాలును స్థానికులకు కేటాయించిన తరువాతే ఇతర గ్రామాలకు ఇవ్వాలని వారు కోరారు...
నెల్లూరు, పిబ్రవరి 11, (రవికిరణాలు) : కరోనా వైరస్ తో చైనా దేశం భయబ్రాంతులకు గురైందని ఈ వైరస్తో చైనాలో గత ఆదివారం ఒక్కరోజే ఏకంగా 97 మంది మరణించారని.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున విచ్చేసిన అబ్దుల్ మోయిన్ పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సమగ్ర గ్రామీణాభివృద్ధి సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఎస్.వి.ఆర్ స్కూలు విద్యార్థులచే జాకీర్ హుస్సేన్ నగర్ నుండి సత్యనారాయణపురం సెంటర్ వరకు కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ మరియు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రబలిన తరువాత ఒకే రోజు ఇంత మంది మృత్యువాత పడటం ఇదే తొలిసారి, కరోనా వైరస్ గబ్బిలాలు పాముల నుండి మనిషికి వ్యాపిస్తుందని తరువాత గాలి ద్వారా అత్యంత వేగంగా మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందని తెలియజేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు కరిమద్దెల నరసింహారెడ్డి మాట్లాడుతూ.. దగ్గు, తుమ్ములు, ముక్కునుండి నీరు కారడం వంటి లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలి, దగ్గినా తుమ్మినా జేబులో రుమాలు పెట్టుకుని వినియోగించాలి, కరోనా వైరస్తో బాధపడడం కన్నా ముందస్తు జాగ్రత్త మిన్న అని అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూలు కరస్పాండెంట్ అందె శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ బి. రమేష్ బాబు, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మురళీమోహన్ రాజు, గౌరవాధ్యక్షుడు టి. వెంకటేశ్వర్లు, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వి సురేష్ బాబు, గీతామయి వృద్ధాశ్రమ అధినేత తమ్మినేని పాండు, లెక్చరర్ క్రాంతికుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది షఫీ హిదాయత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
నెల్లూరు, పిబ్రవరి 10, (రవికిరణాలు) : సోమవారం జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 02.30 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న"స్పందన" కార్యక్రమంనకు అందిన ఫిర్యాదులను 7 రోజులలోగా పరిష్కరించాలని, అన్నీ పోలీసు స్టేషన్ లు, సర్కిల్, యస్.డి.పి.ఐ. ఆఫీసులలో జరుగుతున్న స్పందన కార్యక్రమంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ, వెంటనే వారి సమస్యల పై అక్కడి అధికారులతో లైవ్ లో మాట్లాడుతూ తగిన ఆదేశాలు జారీ చేసినారు. స్పందనకు జిల్లా నలుమూలల నుండి యస్పి స్పందన కార్యక్రమానికి మొత్తం 110 మంది ఫిర్యాదుదారులు హాజరుకాగా, అన్నీ సబ్ డివిజన్ స్థాయిలో మరో 18 ఫిర్యాదులు అందినవి. ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో భూతగాదాలు, భార్యా భర్తల గొడవలు, వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న సంతానం, మిస్సింగ్ కేసుల అర్జీలు ఎక్కవగా ఉన్నవి. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన యస్పి వాటిని సంబంధిత అధికారులకు ఎగ్జార్స్ చేయుచూ, అనుమానాస్పద మృతుల కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అదేవిధంగా మిస్సింగ్ కేసుల ట్రేసింగ్ విషయంలో అలసత్వం వహిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆదేశించారు. ఫిర్యాదుదారులను స్టేషన్ ల చుట్టూ తిప్పుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి, వారికి న్యాయం జరిగేలా త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మహిళలు, బాలలు, వృద్ధులపై జరిగే హింస, లైంగిక వేదింపుల కేసులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా సివిల్ నేచర్ ఫిర్యాదులతో స్పందనకు వస్తున్న పిర్యాదు దారులకు జిల్లా న్యాయ సేవ అధికారిక సంస్థ (డిఎల్‌ఎస్‌ఏ) రెవిన్యూ సేవలు కూడా వినియోగించుకోవాలి అని సూచించారు. స్పందన కార్యక్రమానికి యస్పితో పాటు అడిషనల్ యస్పి(క్రైమ్స్) పి.మనోహర్ రావు, నెల్లూరు టౌన్ డిఎస్పి జె.శ్రీనివాస రెడ్డి, రూరల్ డిఎస్పి కె.వి.రాఘవ రెడ్డి, యస్.బి డిఎస్పి యన్.కోటారెడ్డి హాజరుగా ఉన్నారు.