రైతులపై కేసులు పెట్టింది వైకాపా ప్రభుత్వం కాదా....? రైతులు క్రాప్ హాలిడే ప్రకటించింది వైకాపా ప్రభుత్వంలో కాదా....?
గతంలో జిల్లాలో ఎప్పుడూ క్రాప్ హాలిడే ప్రకటించిన దాఖలాలు లేవు....కేవలం ప్రభుత్వం పుణ్యాన జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు..
నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ రైతుబిడ్డలే.... వీరే పంటలు వేయకుండా వారి ప్రభుత్వాన్ని పొగడడం సిగ్గు లేని చర్య....
ఎదుటి వారి పై విమర్శలు చేసేటప్పుడు, అసలు రైతుల కోసం వైకాపా నాయకులు గుర్తు చేసుకోవాలి..
రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతు భరోసా కేంద్రాలు పెట్టడం హాస్యాస్పదం..
జిల్లా లో వైకాపా నాయకులు చెప్పినట్టు తెదేపా రైతులను 100% మోసం చేస్తే, వైకాపా 1000% మోసం చేస్తుంది.
రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన సంగతి మర్చిపోయి, వైకాపా నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు..
జిల్లా లో 5 లక్షల ఎకరాలు సాగు చేయడానికి నీరు ఉండి కూడా, కేవలం 1.5 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట పండించారు...
- ఒట్టూరు సంపత్ యాదవ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి
గురువారం నెల్లూరు నగరం లోని ఎన్టీఆర్ భవన్ లో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా ఒట్టూరు సంపత్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ...
ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా దాని పై రాళ్లు వేయడమే పనిగా వైకాపా ప్రభుత్వం పెట్టుకుందనీ అన్నారు..
రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ రైతు కోసం తెలుగు దేశం అన్న కార్యక్రమం చేపడితే దానిపై వైకాపా నాయకులు విమర్శలు చేయటం దారుణమన్నారు..
ఈ కార్యక్రమానికి వచ్చింది రైతులు కాదు, 200 రూపాయలు ఇచ్చి తీసుకువచ్చిన జనాలనీ వైకాపా నేతలు అంటున్నారు..అసలు రైతులను అలా మాట్లాడటానికి సిగ్గు శరం, మానవత్వం లాంటివి ఏమన్నా ఈ వైసీపీ నాయకులకు ఉన్నాయా అని అన్నారు..
ఈ జిల్లాలో 5 లక్షల ఎకరాల పంట పండించడానికి సాగునీరు ఉన్నా కేవలం 1.5 లక్షల ఎకరాలలో మాత్రమే పంట పండించే పరిస్థితి జిల్లాలో ఉందనీ అన్నారు...
నీరు పుష్కలంగా ఉండి కూడా రైతులు పంటలు పండించలేని పరిస్థితిలో ఉండటాన్ని చూసి వైసిపి నాయకులు సిగ్గుపడాలి అని అన్నారు...
నెల్లూరు జిల్లాలో నీరు పుష్కలంగా ఉండి కూడా,వైకాపా రాజ్యసభ ఎంపీ గారి సొంత మండలం అల్లూరు లో ఉన్న 22వేల ఎకరాల్లో పంట పండించే పరిస్థితి లేకపోవడం సిగ్గుచేటనీ అన్నారు...
రైతులు స్వయంగా నిరసన తెలియపరుస్తూ క్రాఫ్ హాలిడే ప్రకటిస్తుంటే అది మరచిపోయి వైసిపి నాయకులు మాట్లాడుతున్నారన్నారు...
రైతులు పంటలు పండించకపోయినా మోకాల లోతు నీరు ఉన్నాయని వైకాపా నాయకులు సంకలు గుద్దుకుంటున్నారు. పంటలు పండించడానికి ఉపయోగపడనీ నీరు దేనికని మండిపడ్డారు..
కరోనా తీవ్రరూపం దాలుస్తున్న లెక్కచేయకుండా రైతులు పంటలు పండిస్తే వారికి గిట్టుబాటు ధర కల్పించడం లో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గుర్తుచేశారు...
రైతులకు గిట్టుబాటు ధర లేక వారు పండించిన పంటలను రోడ్డుపాలు చేసి నిరసన తెలియపరిస్తే, వాటిపై కూడా కేసులు పెట్టిన ఘనత వైకాపా ప్రభుత్వానిది అన్నారు...
ఈ జిల్లాలో ఉన్న ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీ రైతులను 100% మోసం చేసింది అంటున్నారని తెలుగుదేశం పార్టీ 100% మోసం చేస్తే ఈ వైకాపా ప్రభుత్వం 1000% మోసం చేస్తోందని మండిపడ్డారు...
గతంలో జిల్లాలో ఎప్పుడూ క్రాప్ హాలిడే ప్రకటించిన దాఖలాలు లేవని, కేవలం వైకాపా ప్రభుత్వం పుణ్యాన జిల్లాలో మొదటిసారిగా క్రాప్ హాలిడే ప్రకటించారనీ అన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టడం హాస్యాస్పదం అని అన్నారు..
ప్రతి నెల రైతు భరోసా కేంద్రాల్లో జరిగే సమావేశాలకు వైకాపా కు చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గానీ హాజరు కావడం లేదని అసలు వీరికి రైతులకు ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన ఉంటే కదా హాజరు కావటానికి అని హేళన చేశారు..
రైతులను పట్టించుకుని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులు పంటలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
ఎదుటి వారిపై విమర్శలు చేసేటప్పుడు ముందు అసలు మనం రైతులకు ఏం చేశామో గుర్తు చేసుకోవాలని వైకాపా నాయకులకు హితవు పలికారు...
నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ రైతుబిడ్డ లేనని, వారే పంటలు వేయకుండా ప్రభుత్వాని పొగడడానికి సిగ్గు గా లేదా అని అన్నారు...
పై కార్యక్రమం లో నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి కనపర్తి గంగాధర్, నగర ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నెల్లూరు మురళి, అనీల్, ఆనంద్, అనీం పాల్గొన్నారు....
ఆత్మకూరు పట్టణంలో కొండమ్మ అనే మహిళ మృతి అత్యంత హేయమైన సంఘటన అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కొండమ్మ అనే ఓ మహిళ ఆత్మహత్య సంఘటనపై స్పందించి ఆత్మకూరు పట్టణానికి గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు విచ్చేశారు.. ఈ సందర్భంగా వారు పట్టణంలోని జె ఆర్ పేట లో నివాసం ఉంటున్న కొండమ్మ ఇంటికి వెళ్లి ఇంటి పరిసరాలను పరిశీలించి కొండమ్మ పిల్లలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మాట్లాడారు.సాక్షాత్తు భర్త భార్యను ఆత్మహత్య కు ప్రోత్సహిస్తూ వీడియో తీయడం బాధాకరమని, మీ కుటుంబానికి మా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పిల్లలకు శ్రీమతి పద్మగారు భరోసా కల్పించారు..ఇటువంటి సంఘటన నిజంగా మానవత్వం ఉన్న మనుషులకు సిగ్గుచేటైన సంఘటనని అన్నారు. తర్వాత ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కట్టుకున్న భార్య ప్రాణం తీసుకుంటూ ఉంటే ఆమె భర్త కనీసం మనిషిగా కూడా స్పందించక పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి సంఘటన ఒక స్త్రీ లోకానికి కాకుండా మానవ లోకానికి తీరని మచ్చ అని శ్రీమతి పద్మ గారు తెలిపారు..ఇటువంటి మృగాళ్లు కూడా మనుషుల మధ్య ఉన్నారా అనిపించే ఈ సంఘటన ఇది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపడతామని అన్నారు..ఏ చిన్న సంఘటనను కూడా రాష్ట్ర పోలీస్ స్పందించే విధంగా దిశా యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ప్రచారం చేస్తూ ఉన్న కూడా దానిని ఉపయోగించుకునే అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని రాష్ట్ర సచివాలయ పోలీస్ వ్యవస్థ ద్వారా మరింతగా దిశ యాప్ గురించి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు.. గుండమ్మ పిల్లలకు జిల్లా కలెక్టర్ ద్వారా సంప్రదించి తగు న్యాయం చేస్తామని కొండమ్మ మృతికి ప్రత్యక్షంగా కారుడైన ఆమె భర్త ను కఠినంగా శిక్షించేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామని అన్నారు.అలాగే వైజాగ్ లో జరిగిన సంఘటనపై వారు మాట్లాడుతూ నిందితులు ఏ పార్టీ వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు... వీరి వెంట మహిళా కమీషన్ మెంబర్ గజ్జల లక్ష్మీ.. ఐసీడీఎస్ పీడీ రోజ్ మాండ్, ఆత్మ కూరు ఆర్డీవో చైత్రవర్షిణి, మున్సిపల్ కమీషనర్ రమేష్ బాబు, . ఛైర్ పర్సన్ వెంకట రమణమ్మ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు----
కొమ్మనేటూరు ఎంపిటిసి ఇండిపెండెంట్ అభ్యర్థి గా గెలుపొందిన గడ్డం వెంకటయ్య సుబ్బయ్య
⬜ ఎమ్మెల్సీ సమక్షంలో వైసీపీలో చేరిక
🟩 చక్రం తిప్పుతున్న ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి
🟦 ఎంపీపి అభ్యర్థులు ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్సీ
⬜ అనతి కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు
🟩 రాజకీయాల్లో అరితేరుతున్న ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి
🟦2020 లో చిల్లకూరు మండలంలోని కడివేడు, తోనుకుమాల ఎంపీటీసీ లను ఏకగ్రీవం చేసినకళ్యాణ్ చక్రవర్తి
కారణం వైసీపీలో వర్గపోరు,దింతో మండలాల వైసీపీ నేతలు ఎంపిటిసి అభ్యర్థులను తీసుకొని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ని కలుస్తూ పంచాయితీ లతో సర్దుబాటుచేసుకుంటున్నారు,ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి సమయ స్ఫూర్తితో వ్యహరిస్తూ వైసీపీలో వర్గపోరుకు చెక్ పెడుతూ వైసీపీని బలోపేతం చేస్తూ గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపల్లి కి తోడు నీడ గా నిలుస్తున్నారు,పిన్న వయస్సులోనే ఎమ్మెల్సీ సాధించిన కళ్యాణ్ అనతి కాలంలోనే దివంగత నేత మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ రావు కు తగ్గ తనయుడు గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలోనే గూడూరు మండలంలో వైసీపీని బలోపేతం చేసే దిశలోకొమ్మనేటూరు ఎంపిటిసి ఇండిపెండెంట్ అభ్యర్థి గా గెలుపొందిన గడ్డం వెంకటయ్య సుబ్బయ్య ను గురువారం నెల్లూరు లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి వైసీపీ కండువా వేసి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు.
అంతేకాకుండా 2020 సంవత్సరంలో చిల్లకూరు మండలంలోని కడివేడు, తోనుకుమాల గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఆనాడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఆహ్వానించి పరిషత్ ఎన్నికల్లో కడివేడు, తోనుకుమాల ఎంపీటీసీ లను ఏకగ్రీవం చేయించడంలో కీలకపాత్ర పోషించారు,ఇలా చిన్న వయస్సులోనే రాజకీయాల్లో అడుగుపెట్టి వైఎస్సార్సీపీ బలోపేతం చేసేందుకు అయన చేస్తున్న కృషికి వైసీపీ నుండి ప్రశంసలు అందుకుంటున్నారు.
చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నష్టపరిహారంఅందించడంలో అధికారుల విఫలం
డికేటి, సి జె ఎఫ్ ఎస్, అసైన్మెంట్ భూములకు నష్టపరిహారం ఇవ్వకుండానే ఏపీఐఐసి పేరు మిందా నమోదు
రైతులకు మంచి నష్టపరిహారాన్ని త్వరగా అందరికీ ఓకే విడతలో అందించాలి
సజ్జలను కోరిన పేర్నాటి
:చెన్నై- బెంగుళూరు కోస్టల్ కారిడార్ లో భూములను కోల్పోయిన భూ బాధితులు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోరారు.
గురువారం అమరావతి తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారులుసజ్జల రామకృష్ణా రెడ్డిని క పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పేర్నాటి అనుచరులు, రైతులు మర్యాద పూర్వకంగా కలిసి తీర ప్రాంతంలోని సిబిఐసి (చెన్నై బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్)భూసేకరణలో రైతులకు సంబందించిన పలు సమస్యలుఆయన దృష్టికి తీసుకువెళ్లి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పేర్నాటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులపక్షిపాతిప్రభుత్వంఅని,చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో జరుగుచున్న భూసేకరణ నష్టపరిహారం అధికారులు ఆ దించడంలో విఫలం అవుతున్నారుతెలిపారు.డికేటి, సి జె ఎఫ్ ఎస్, అసైన్మెంట్ భూములకు నష్టపరిహారం ఇవ్వకుండానే ఏపీఐఐసి వారి పేరుమీదుగా భూములను రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు, ఈతప్పిదం అధికారులుదికాదా అనిఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నో సంవత్సరాలుగా సాగుచేయుచున్న రైతులపేర్లనుసాగుదారులగా గుర్తించకపోవటం రెవెన్యూ అధికారుల లోపంకాదా అని ప్రశ్నించారు,అదేమని రైతులు అడిగితే మీ పేర్లు రెవెన్యూ రికార్డులలో లేవు అని,మా ముందు రెవెన్యూ అధికారులు మీ పేర్లు నమోదు చేయలేదు అది మా తప్పా... అంటూ ఇప్పుడున్న రెవెన్యూ అధికారులు చెప్పడం ఏమిటి అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆక్రమణ సాగు రైతులకు ఎంతో నష్టపరిహారం ఇస్తారా ఇంత వరకు అధికారులు ప్రకటించలేదుఅని,కొత్తపట్నం గ్రామపంచాయతీ లోని రైతుల భూములు ఆక్వా కల్చర్సాగు,వరి,వేరుశనగ,సవక,ముంతమామిడి సాగు చేసే సారవంతమైన భూములు కలిగి ఉన్నారు తెలిపారు, అందువలన గత ప్రభుత్వాలు భూసేకరణ చేయాలి అంటే సరియైన నష్టపరిహారం ఇవ్వని కారణంగారైతులుఒప్పుకోలేదు అన్నారు, అందుకే ఆనాడు భూసేకరణ జరగలేదు అని ఆయన చెప్పారు.
జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి ని భూ బాధిత రైతులు కలిసి వారి సమస్యలు చెప్పుకోవడం జరిగింది అన్నారు,సజ్జల సలహ మేరకు పట్టాకు 21,75,000,డికేటి, సి జె ఎఫ్ ఎస్, అసైన్మెంట్, భూములకు 15,00,000 రుపాయలుగా అధికారులు నిర్ణయించారు అని వెల్లడించారు,కాని ఒకేసారి భూసేకరణ చేస్తామని చెప్పారు,కాని ఇప్పుడు దశలవారిగా భూసేకరణ అంటున్నారు అనీ ఈ లోపం ఏపీఐఐసి అధికారులదా లేదా రెవెన్యూ అధికారులకు అర్ధం కాక రైతులు తికమక పడుతున్నారు ఆయన చెప్పారు.
వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సమస్యలకు పరిష్కారం చూపి కొత్తపట్నం గ్రామపంచాయతీ లోని భూసేకరణ చేయాలి అని కోరారు,రైతులకు న్యాయం చేయాలని,లేని పక్షంలో భూసేకరణ సజావుగా సాగేందుకు రైతులు సహకరించరు అనీ హెచ్చరించారు, రైతుల పక్షాన సజ్జల రామకృష్ణ రెడ్డి అధికారులతో చర్చించి రైతులకుమంచినష్టపరిహారాన్ని త్వరగా అందరికీ ఓకే విడతలో ఇప్పించవలసిందిగా సజ్జలను కోరడం జరిగింది అని ఆయన తెలిపారు,ఈ కార్యక్రమంలో సిద్దవరం సొసైటీ అధ్యక్షుడు పాదర్తి రాధా కృష్ణా రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్, ఉప్పల రఘు, దువ్వూరు సాయి కృష్ణా రెడ్డి, వైసీపీ నేతలు ఉప్పల ప్రభాకర్ రెడ్డి, ఇన్నమాల వెంకటాద్రి, వెంకురెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.
నెల్లూరు సెప్టెంబర్ 23 : నెల్లూరు నగరంలో వేంచేసివున్న శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం వంశపార పర్య ధర్మకర్త గా శ్రీ తుమ్మల సుమన్ తేజా రెడ్డి గురువారం ఉదయం 11.50 నిమిషాల కు దేవస్థానం కార్యాలయంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖా అసిస్టెంట్ కమిషనర్ మరియూ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.దేవస్థానం అర్చకులు సుమన్ తేజా రెడ్డిని ఆశీర్వ వచనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నగర ప్రముఖులు,దేవస్థానం సిబ్బంది, సుమన్ తేజా రెడ్డి కి అభినందనలు తెలియజేశారు.