నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) దక్షిణాది రాష్ట్రాల సదస్సులో పాల్గొన్న నెల్లూరు నగర మేయర్ స్రవంతిజయవర్ధన్
తమిళనాడు లో జరిగిన కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, తమిళనాడు ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి బోర్డుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల సేన్సిటైజేషన్ కం రివ్యూ వర్క్ షాప్ “నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) & XV-FC మిలియన్ ప్లస్ సిటీస్ ఫండ్ (XV-FC MPCCF)” సదస్సులో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతిజయవర్ధన్ శనివారం పాల్గొన్నారు. చెన్నై లోని ITC గ్రాండ్ చోళ వేదికలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ వర్క్ షాప్ లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, అండమాన్ నికోబార్, లక్ష ద్వీప్, పాండిచేరి, డయ్యు & డామన్, దాద్రా & నగర్ హవేలీ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొంటున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాల మేరకు 2024 సంవత్సరం నాటికి వాయు కాలుష్యం 20-30% వరకు తగ్గించాలని ప్రతిపాదించే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) నిబందనలను సవరించే దిశగా సదస్సులో ప్రతినిధులు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖామాత్యులు భూపేందర్ యాదవ్, అడిషనల్ సెక్రటరీ అఫ్ ఇండియా నరేష్ పాల్ గంగ్వర్, తమిళనాడు పర్యావరణ మరియు కాలుష్య నియంత్రణ శాఖా మంత్రి శివ వి.మెయ్యనాథన్, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మరియు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి వర్యులు అశ్విని కుమార్ చౌబే, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల సెక్రటరీ లీలా నందన్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
హరినాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి అనిల్.... నెల్లూరు నగరంలోని హరనాథపురం సెంటర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను మాజీమంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల పట్ల మరింత శ్రద్ధ వహించాలని అక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కర్తం ప్రతాపరెడ్డి, గణేష్ వెంకటేశ్వర రెడ్డి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, దామవరపు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలను జూన్ 10 లోపు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
సమాధాన పత్రాల మూల్యాంకనం మే చివరి నాటికి పూర్తి కానుంది. మూల్యాంకనం అనంతరం ఇతర కార్యకలాపాలను ఐదారు రోజుల్లో పూర్తి చేసి, ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. టెన్త్ మార్కుల ఆధారంగానే ఈ ఏడాది ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ముగియగానే విజయవాడలోని రాష్ట్ర పరీక్షల విభాగం కార్యాలయంలో డీ కోడింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. జూన్ 10 లోపు ఫలితాల వెల్లడికి చర్యలు చేపడుతున్నారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి 26 జిల్లాలను యూనిట్ గా తీసుకుని టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు...!!
మహిళల రక్షణకే దిశ యాప్.. రాజుపాలెం మే 21 విశాఖ టుడే రాష్ట్రములోని మహిళలకు రక్షణ కల్పించాలని మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని రాజుపాలెం ఎస్ ఐ మహమ్మద్ షఫీ పిలుపునిచ్చారు దీనిలో భాగంగా స్పెషల్ డ్రైవ్ దిశ యాప్ పై రాజుపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది సచివాలయం పోలీసులు వాలంటీర్స్ కలిసి మాచర్ల గుంటూరు రహదారిపై మహిళలకు దిశ యాప్ గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు వాహనదారులకు ప్రయాణికులకు దగ్గరుండి దిశ యాప్ ఏ విధంగా వినియోగించుకోవాల్సిన దో రాజుపాలెం పోలీసులు శనివారం ఉదయం 5 గంటల నుండి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ కిరణ్ కుమార్ రాంబాబు కనకరాజు పాండు సచివాలయం పోలీసులు వాలంటీర్స్ పాల్గొన్నారు.
చిత్తూరు: యువతి, యువకుడు దారుణ హత్య!
సదుం మండలం జాండ్రపేటలో
ఇద్దరి అనుమానాస్పద
మృతి కలకలం రేపింది. వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్న రాధా, వెంకటేషు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బండరాయితో మోది చంపినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన ఇద్దరు మదనపల్లి ప్రాంతానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.