నెల్లూరు జిల్లా కి నూతన కలెక్టర్ గా, ఈరోజు చార్జ్ తీసుకున్న కలెక్టర్ ఆనంద్
ఆరు సంవత్సరాలు క్రితం గూడూర్ సబ్ కలెక్టర్ గా పని చేశాను నెల్లూరు జిల్లా కి కలెక్టర్ గారు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వం సంబంధించిన ప్రోగ్రామ్లకు దృష్టి పెడతానని తెలియజేశారు ప్రజలకు సంబంధించిన గ్రీవెన్స్ లో ప్రజల సమస్యలు దృష్టి పెడతానని తెలిపారు
నెల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయ ఆధునీకరణకు చర్యలు
రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు, జూలై 3 : నెల్లూరు నగరం మూలాపేటలోని ప్రసిద్ధి ఆలయమైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని ఆధునీకరించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావుకు సూచించారు. బుధవారం సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్‌కు మంత్రి పలు సూచనలు చేశారు. వేణుగోపాలస్వామి దేవాలయం నిధులు, ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా చేయాలని సూచించారు. అలాగే నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయాన్ని తాను మంత్రి అయిన తరువాత తాను, మంత్రి నారాయణ కలిసి ఆలయాన్ని సందర్శించామని, ఆలయంలో ఎంతో ప్రసిద్ధి చెందిన అద్దాల మండపం పునర్నిర్మాణం చేపట్టేందుకు, మండపంలోని చారిత్రాత్మక చిత్రాల రూపకల్పన మొదలైన పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల్లూరు నగరంలోనే రంగనాథస్వామి ఎంతో విలువైన ఆస్తులు వున్నాయని, పూర్తిస్థాయిలో ఆస్తుల వినియోగం, ఆదాయంపై దృష్టిసారించాలన్నారు. జిల్లాలో చాలా ఆలయాలకు విలువైన ఆస్తులు, భూములు వున్నాయని, అయిననూ ధూపదీప నైవేద్యాలకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. వీటన్నింటిపై దృష్టిపెట్టనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, నెల్లూరు వారిచే జారీ
చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన ఎంపీ వేమిరెడ్డి
ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లిన వేమిరెడ్డి గారు.. చంద్రబాబు గారికి పుష్పగుచ్చమిచ్చి సత్కరించారు. అనంతరం ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు.
మేనకూరు సెజ్ లో స్థానికులకు 70శాతం ఉద్యోగాలు ఇవ్వాలి- మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం
రవి కిరణాలు, తిరుపతి జిల్లా, నాయుడుపేట:-
నాయుడుపేట మండలంలోని మేనకూరు సెజ్ లో ఉన్న పరిశ్రమల్లో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని మాజీ ఎంపీ, సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. మండలంలోని మాబాక గ్రామంలో ఇండస్ కాఫీ పరిశ్రమ సౌజన్యంతో గుడ్లూ రు ప్రభాకర్ నాయుడు,గాలి రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను బుధవారం మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసి చైర్మన్ శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, టిడిపి నేత కట్టా వెంకటరమణారెడ్డి లతో కలిసి ప్రారంభించారు.తొలుత ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనం బేటి విజయభాస్కర్ రెడ్డి,షేక్ రఫీ,కట్టా వెంకటరమణారెడ్డి లకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సమావేశంలో నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కార్పొ రేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా ఇండస్ కాఫీ పరి శ్రమ యాజమాన్యం 7లక్షల 50 వేల రూపాయలతో మాబాక గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.సెజ్ లో భూములు కోల్పోయిన గ్రామాలను దత్తత తీసుకొని మౌలిక వసతులు కల్పించాలని పరిశ్రమ యాజమాన్యాలను కోరారు. లాభపేక్ష కాకుండా సి.ఎస్. ఆర్ కింద 2 శాతం నిధులు కేటాయించి ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం సంతోషమన్నా రు.మాబాక గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే నెల వల విజయశ్రీ తరపున ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియా డారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా సూళ్ళురు పేట నియోజకవర్గంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతకు ట్రైనింగ్ ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.కోనేటిరాజుపాలెం,పాల్చూరు,కాసారం,మాబాక వంటి గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు,రోడ్డు నిర్మాణాలు,బస్టాండ్లు అంగన్ వాడి స్కూల్స్ ఏర్పాటు చేసిన ఇండస్ కాఫీ యాజమాన్యాన్ని అభినందించారు.ఈ కా ర్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు థార్ప్ దార్,రవిగౌడ్,మహేష్ రెడ్డి,రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు సుధీర్ రెడ్డి కామిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి, అవధానం సుధీర్,సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి, దయాకర్ నాయుడు, ప్రసాద్ నాయుడు,మస్తాన్ నాయుడు,జడపల్లి వెంక టేశ్వర్లు,ఇల్లుమణి,పెద్ద వెంకట య్య, జమల్ల కస్తూరయ్య,కాపు లూరు చక్రపాణి,బల్లి ముత్యాల య్య,తదితరులు పాల్గొన్నారు.
జగన్ ఇసుక పాలసీతో ప్రజలు నష్టపోయారు నిన్న సుదీర్ఘంగా ఇసుక విధానం పైన సమీక్ష నిర్వహించిన చంద్రబాబు జగన్ పరిపాలన సమయంలో ఇసుక పాలసీ వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణరంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి భారీగా ధరలను పెంచి, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గుర్తించినట్టు
ఎమ్మెల్యేగా తొలిసారి పొదలకూరు గడ్డపై అడుగుపెట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన నావూరు ప్రజలు
సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా శ్రీ పోలేరమ్మ తల్లికి పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు
ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడుతో కలిసి శ్రీ పోలేరమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సోమిరెడ్డి
పొదలకూరు మండలంలోనే తొలిసారిగా నావూరులో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన సోమిరెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాక సందర్భంగా నావూరులో పండగ వాతావరణం
తిరుపతి పరిశుభ్రతకు ప్రాధాన్యమిద్దాము : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్
తిరుపతి నగరం
తిరుపతి నగరంలో పరిశుభ్రతకు ప్రాధాన్యతమివ్వాలని, పరిసరాలు, కాలువలు, రహదారులు శుభ్రంగా వుంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మనమందరం కృషి చేద్దామని మునిసిపల్ కార్పొరేషన్ పారిశుధ్య, ఇంజనీరింగ్ సిబ్బందికి సూచనలు చేసారు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్. తిరుపతి నగరంలోని భవానీ నగర్, రైల్వే కాలనీ, సుందరయ్య నగర్, సప్తగిరి నగర్, యశోధ నగర్, మధురా నగర్, ఖాధీ కాలనీ, కేటి రోడ్ ప్రాంతాల్లో బుధవారం ఉదయం కమిషనర్ పర్యటించారు. సామవాయి మార్గంలో స్వీపింగ్ మిషన్ల పనితీరును పరిశీలించి తగు సూచనలు జారీ చేస్తూ స్వీపింగ్ పనులను పూర్తి స్థాయిలో అనుకున్న మేరకు పూర్తి చేసేలా సిబ్బంది పనితీరు వుండాలన్నారు. బ్లిస్ ప్రక్కన మురుగునీరు లీక్ అవుతున్న విషయాన్ని పరిశీలించి, మరమ్మత్తులు వెంటనే చేయాలని, రేణిగుంట రోడ్డు ప్రాంతాల్లో రహదారిపై డ్రైనేజి పైప్ దెబ్బతినడంతో ఆ పరిసరాలు మురుగునీటితో కనిపించడంతో తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. ఉప్పంగి హరిజన వాడ, భవాని నగర్ ప్రాంతాల్లో డ్రైనేజి మూతలను తీయించి మురుగు నీరు సక్రమంగా పారుతున్నదా అని కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ అదితిసింగ్ అధికారులకు సూచనలు ఇస్తూ తిరుపతిని అన్ని విధాలా తీర్చిదిద్దాలని, ముఖ్యంగా పారిశుధ్యాని ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రైనేజి మరమ్మత్తులను, కాలువల్లో సీల్ట్ తీయించే ప్రక్రియ నిరంతరం చేపట్టాలని, త్రాగునీటి పైప్ లైన్లలో మురుగు నీరు కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డయేరియా, మలేరియా, డెంగీ ప్రభలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, బ్లీచింగ్ చల్లించడం, క్లోరినేషన్ ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకొని పనులు చేపట్టడం చేయాలని, అదేవిధంగా మురికి నీరు సాఫిగా వెల్లేందుకు నిరంతరం పర్యవేక్షిస్తూ కాలువలపై ఆక్రమణలు తొలగించాలని, తిరుపతి పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ ప్రజలనుద్దేశించి విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈ శ్రావణి, శానిటరి సూపర్ వైజర్లు చెంచెయ్య, సుమతి పాల్గొన్నారు.
ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే మా లక్ష్యం - ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
- ఇనమడుగు పిహెచ్‌సిలో వసతులు మెరుగుపరుస్తా..
- కోవూరు మండలంలో మరో పిహెచ్సి ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పనిచేయడమే తమ లక్ష్యమని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిగారు అన్నారు. బుధవారం కోవూరు మండలంలోని ఇనమడుగులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సంబంధ విషయాలపై స్థానిక వైద్య సిబ్బందితో చర్చించారు. పరీక్షలకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ను అడిగి వివరాలు ఆరా తీశారు. ఇనమడుగు పిహెచ్‌సిలో అందిస్తున్న వైద్య సేవలు మరియు సిబ్బంది వ్యవహార శైలి గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.అన్ని విభాగాలను పరిశీలించి వసతులు, సమస్యలను తెలుకున్నారు. ఈ సందర్భంగా రోగులను పరామర్శించి వారికి పండ్లు అందించారు. ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిగారు మాట్లాడుతూ... నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పనిచేయడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం కోవూరు మండలంలో 80 వేలమంది ఉండగా.. వాళ్లకు కేవలం ఒక పీహెచ్‌సీ మాత్రమే ఉందన్నారు. తప్పకుండా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రెండో పిహెచ్‌సి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పేదలే వస్తుంటారని, వారి పట్ల ప్రేమగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. వైద్యారోగ్యం పై ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోందని, అవి సద్వినియోగం అయ్యేలా బాధ్యతాయుతంగా పని చేయాలని ఆదేశించారు. ఇనమడుగు పిహెచ్‌సిలో స్థానిక డాక్టర్లు ఆమె దృష్టికి తెచ్చిన సమస్యలపై స్పందిస్తూ మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తానన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ గుర్తింపు సాధించిన విడవలూరు మండలంలోని రామతీర్ధం పిహెచ్‌సిని ఆదర్శంగా తీసుకొని ఉత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందించాలని సూచించారు. స్థానిక సర్పంచ్ తదితర ప్రజా ప్రతినిధులు సైతం తరచూ ఆసుపత్రిని సందర్శించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి వైద్యాధికారి నిరంజన్, సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎమ్ లతో పాటు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ఎంపీపీ పార్వతి, ఎంపీటీపీ కొల్లా సునీల్ రెడ్డి, సర్పంచి ప్రమీళమ్మ, ముఖ్య నాయకులు సుధాకర్‌రెడ్డి, గుత్తికొండ వెంకయ్య, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, కమలాకరరెడ్డి, జనసేన నాయకులు గుడి శ్రీహరి రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాస్టర్స్ గౌరవవేతనాన్ని కొనసాగించాలి
పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం హనోక్
నెల్లూరు: పాస్టర్స్ గౌరవ వేతనాన్ని కొనసాగించాలని పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం హనోక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాస్టర్స్ అనే వారు దేశం, రాష్ట్రం బాగుండాలని ప్రార్ధించే వారని అలాంటి వారి కోసం వున్న ఏకైక పథకం గౌరవ వేతనమేనని అన్నారు.గత ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చేదని తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సేవకుల సంక్షేమం కోసం గౌరవేతన పథకాన్ని కొనసాగించాలని కోరారు. అనంతరం భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కె ఎస్ రాజు, సదాశివరావు,ప్రధాన కార్యదర్శి ఏ రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జాషువా, కోశాధికారి కిషోర్ కుమార్,సహాయ కార్యదర్శిలు శ్యామ్ ప్రసాద్, సుధీర్ బాబు, కార్యవర్గ సభ్యులు ఎనోష్, గిద్యోని తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు ysrcp జిల్లా పార్టీ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, Mlc చంద్రశేఖర్ రెడ్డి,
మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. పింఛన్ ని ఇంటింటికి పంపిణికి శ్రీకారం చుట్టిందే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అలాంటిది పింఛన్ ఇచ్చే సమయంలో మాజీ సీఎం జగన్ ని తిట్టడం సిగ్గుచేటన్నారు, టీడీపీ తీసుకున్న నిర్ణయంలో లోపాలు వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారన్నారు..,
టీడీపీ అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఇన్స్పిరేషన్ మా నాయకుడు జగనేనని....,
కొన్ని చోట్ల పింఛన్ల పంపిణీ లో టీడీపీ నేతలు చేతివాటం ప్రదర్శించారని... అలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలన్నారు.. వైసీపీ సానుభూతి పరుల పింఛన్ల తొలగిస్తే ఊరుకోమన్నారు..
మాజీ ఎమ్మెల్యే పిన్నేలిని పరామర్శించేందుకు మాజీ సీఎం y s జగన్ మోహన్ రెడ్డి 4 తేదీన ఉదయం 10:30 నిముషాలకి నెల్లూరు కి వచ్చి జిల్లా జైల్ లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ని పరామర్శించి అనంతరం తిరిగి వెళ్ళిపోతారన్నారు...,
Mlc చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సుమారు అరవై లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వడానికి సుమారు కోటి మంది అర్హత ఉన్నవారు, లేనివారు కలిసి ఒక యుద్ధ వాతావరణన్నీ కల్పించాలని, జగన్ మోహన్ రెడ్డి పేదవారి ఆత్మగౌరవాన్ని కపాడుతూ వారి ఇంటి వద్దకే మూడో కంటికి తెలియకుండా సంక్షేమ పథకాలను అందించారని , రాబోయే రోజుల్లో కూడా తాము పేద ప్రజలకు అండగా ఉంటామన్నారు, ఈ కార్యక్రమంలో ysrcp నాయకులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ గా డా.ఎస్. వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్
రవి కిరణాలు
తిరుపతి, జూలై02:-
డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న డా.ఎస్. వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే వారు తిరుపతి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సంస్థ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త జయ భారతి సేవలు ఎనలేనివి : జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర
నేను కలెక్టర్ గా ఉన్నత స్థాయికి ఎదగడానికి కారణం మా అమ్మ : అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్
రవి కిరణాలు,తిరుపతి, జూన్ 30 :-
సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సంస్థ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త జయ భారతి సేవలు ఎనలేనివి అని జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర కొనియాడారు.
స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త పదవీ విరమణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సంస్థ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త జయభారతి సేవలు ఎనలేవని తెలిపారు. పదవీ రమణ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి సాధారణం అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో సుదీర్ఘoగా 34 సంవత్సరాలు సేవలందించారని తెలిపారు. నేడు పదవీ విరమణ పొందుతున్న డి సి ఓ వారి జీవితాన్ని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడపాలని ఆ దేవుడు వారికి ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
డి సి ఓ కుమారుడు మరియు ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ అయిన అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ.. మా అమ్మ విజయవంతంగా తన పదవీ కాలాన్ని పూర్తిచేసుకుని ఈరోజు పదవి విరమణ పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నేను ఈరోజు ఉన్నత స్థాయిలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్నానంటే దానికి మా అమ్మే కారణమని తెలిపారు. నేను చిన్నప్పుడు నుంచి పుట్టి పెరిగింది గురుకుల పాఠశాలలోనే అన్నారు. నాకు చదువు నేర్పించిన ఉపాధ్యాయులు ఇక్కడే ఉన్నారని, వారి సమక్షంలో ఈరోజు అమ్మ పదవీ విరమణ పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఈ ప్రభుత్వంలో కలెక్టర్ గా పనిచేస్తూ, అమ్మ కూడా ఇదే ప్రభుత్వంలో పని చేస్తూ ఈ పదవీ విరమణ కార్యక్రమానికి హాజరవ్వడం సంతోషంగా ఉందన్నారు. విజయం ఎలా పొందాలి, ఎలా సాధించాలి అనేది మా అమ్మని చూసే నేర్చుకున్నాను అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల ప్రధాన ఉపాధ్యాయులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది డి సి ఓ సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డక్కిలి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లు ప్రభావతి, శ్రీదేవి ఉమ్మడి తిరుపతి చిత్తూరు జిల్లాల ప్రధానోపాధ్యాయులు బోధన మరియు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సమాచారశాఖ మంత్రి కె. పార్థ సారధి గారిని కలసిన ఫౌండర్ ఛైర్మన్ లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారు
ఈరోజు సమాచారశాఖ మంత్రి కె. పార్థ సారధి గారిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలసిన ఫౌండర్ ఛైర్మన్ లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షులు రవితేజ, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డితో పాటుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు,కె రామచంద్రారెడ్డి కార్యదర్సులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్సులు మరియు మహిళా ప్రతినిధి లలిత నాయకులు కలసి జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది..
అన్నదాతలకు అవసరమైన వరి వంగడాలను సకాలంలో అందించాలి" ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ "
దొరవారి సత్రం, రవికిరణాలు
వ్యవసాయ రంగంలో రారాజులైన అన్నదాతలకు అవసరమైన వరి వంగడాలను సకాలంలో సబ్సిడీ విధానంలో వారికి అందేలా చూడాలని సులూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. గురువారం ఆమె మండల వ్యవసాయ అధికారుల ఏర్పాటుచేసిన పచ్చి రొట్ట ఎరువు విత్తనాలను రైతులకు సబ్సిడీలో పంపిణీ చేశారు. వ్యవసాయంలో అధిక దిగుబడులు వచ్చేందుకు, భూమి సారవంతంగా ఉండేందుకు ఉపయోగిస్తున్న పిల్లి పెసరు, జీలుగ, జనము విత్తనాలను తక్కువ ధరలకే సబ్సిడీ రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అన్నదాత దేశానికి వెన్నెముకని, రైతే రాజని అన్నారు. ప్రభుత్వపరంగా అన్నదాతలకు వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలను సకాలంలో చేరేలా చూడాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు గ్రామాలలో పర్యటించి, వారి భూములకు అనుపైన పంటలు వేసుకునేందుకు సూచనలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ వేమసాని శ్రీనివాసులు నాయుడు, మాజీ ఎంపీపీ ఇట్టికుంట రత్నయ్య, ఎంపీపీ దువ్వూరు సుజాతమ్మ, వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి వ్యవసాయ శాఖ ఏడి అనిత, ఏఓ లు జ్యోతిర్మయి, కవిత, కాంచన ఉద్యానవన శాఖ అధికారులు, సులూరుపేట తెలుగుదేశం నాయకులు సుధాకర్ రెడ్డి, దొరవారిసత్రం మండల నాయకులు యాగాని. ఆది ముని, కృష్ణమూర్తి, ఉదయ్ కుమార్, మురళి రెడ్డి, బాబు నాయుడు, కిషోర్ తెలుగు ప్రాజెక్టు సిబ్బంది, డిప్యూటీ తాసిల్దార్ గోపిరెడ్డి,
నేడు శ్రీ చెంగాళ్ళమ్మ హుడీ లెక్కింపు
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు పరాకామణి(హుండీ లెక్కింపు) తేది.27-06-2024 ఉదయం 09:00 గం’’లకు దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో పరాకామణి(హుండీ లెక్కింపు) కార్యక్రమము జరుగునని ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు తెలిపారు . ఆసక్తి గల భక్తులు పరాకామణి(హుండీ లెక్కింపు) కార్యక్రమములో డ్రెస్స్ కోడ్ (పంచే, బన్నియన్) పాటించుచూ పాల్గొనవలసినదిగా కోరారు.
విద్యార్థులకు విద్యాసామాగ్రి కిట్లు పంపిణీ.
సులూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించిన విద్యా కిట్లను సులూరుపేట శాసనసభ్యులు నెలవల డాక్టర్ విజయ శ్రీ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. గురువారం తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఎల్ఐసాగరం లోతువానిగుంట హైస్కూల్ వద్ద విద్యార్థులకు కిట్లు పంపిణీలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మాట్లాడుతూ విద్యార్థులు చదువు అనే ఆయుధంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించి ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆమె విద్యార్థులకు సూచించారు.అలాగే విద్యార్థులకు బ్యాగు,పుస్తకాలు,జామెంట్రీ బాక్సులు,షూ బట్టలు అందజేశారు. అనంతరం హైస్కూల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా చెట్లమొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఎంఈఓ మునిరత్నం,పేట జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ఉయ్యాల ప్రవీణ్,టిడిపి యువ నాయకులు నెలవల రాజేష్,గూడూరు సుధీర్ రెడ్డి,తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు అవధానం సుధీర్,మొండెం బాబు,వినుకొండ ధనంజయ,టిడిపి నాయకులు ఉపాధ్యాయులు గడదాసుల వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సఖి వన్ స్టాప్ సెంటర్ మరియు గృహ హింస చట్టం విభాగ కేంద్రాలను సందర్శించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డా. యోగేష్ దూబే
రవి కిరణాలు,తిరుపతి, జూన్ 25 : -
తిరుపతిలోని ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయబడిన సఖి వన్ స్టాప్ సెంటర్ మరియు గృహ హింస చట్టం విభాగం కేంద్రాలను మంగళవారం సందర్శించి పలు సూచనలు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డా. యోగేష్ దూబే.
సఖి వన్ స్టాప్ సెంటర్ మరియు గృహ హింస చట్టం విభాగం కేంద్రాల పని తీరు మరియు సిబ్బంది యొక్క వివరములు తెలుసు కోవడం జరిగినది. సదరు కేంద్రం నందు భాదితులకు అందుచున్న సేవలు మరియు వారి యొక్క వివరములు తెలుసుకోవటం జరిగినది. ప్రతి కేసు వారీగా బాధితులకు అందుచున్న సేవలు, వారి యొక్క అభిప్రాయాలూ తెలుసుకోవడం జరిగినది. కేంద్రం యొక్క పనితీరు మెరుగు పరచాలని సూచనలు చేయడం జరిగినది. సఖి వన్ స్టాప్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగములు వీలు అయినంత త్వరగా భర్తీ చేయవలెనని ఆదేశించటం జరిగినది. తాత్కాలిక భవనము అయిన సఖి వన్ స్టాప్ సెంటర్ మరియు గృహ హింస చట్టం విభాగoలను వీలు అయినంత త్వరగా ప్రత్యేక భవనములోనికి మార్పు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమములో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని అయిన శ్రీమతి . ఎస్ జయలక్ష్మి , జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్. శేఖర్ , సఖి వన్ స్టాప్ సెంటర్ సెంటర్ అడ్మిన్ సుజాత , గృహ హింస చట్టం విభాగం కౌన్సిలర్ సుగుణ పాల్గొనడం జరిగినది.
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
సుళ్ళురుపేట నుండి పేర్నాడు కొరిడికి కి వెళ్లే బస్సుకు మంగళవారం తృటిలోపెను ప్రమాదం తప్పింది. ఉదయం అసలే బస్సు రద్దీగా ఉంది టీచర్స్, హాస్పిటల్స్ సిబ్బంది తొ ప్రయాణికులతో సూళ్లూరుపేట నుంచిబయలుదేరిన బస్సు పేర్నర్ రోడ్ లో ఒకసారి గా అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఊర్లకి వెళ్లాలంటే రోడ్లు సరిగా లేకపోవడంతో బస్సు అదుపు తప్పిందని ఉద్యోగస్తులు ప్రయాణికులు వాపోయారు. ఇకనైనా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు స్పందించి ఈ గ్రామానికి వెళ్లే రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టి తారు రోడ్డు వేయాల్సిందిగా ఉద్యోగస్తులు ప్రయాణికులు కోరుతున్నారు.
కోటపోలూరు గ్రామంలో డయేరియా పై గ్రామస్తులకు అవగాహన సదస్సు.
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట పంచాయతీ పరిధిలోని వాటర్ పోలూరు 1వ గ్రామ పంచాయతీ నందు మంగళవారం డయేరియా అవేర్నెస్ అనే కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామపంచాయతీ లోని వివిధ గ్రామాలలో డయేరియా అవేర్నెస్ కల్పిస్తూ పరిసరాలను పరిశీలించి శానిటేషన్ చేయించడం జరిగినది. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి, విస్తరణాధికారి, ఆర్డబ్ల్యూఎస్ డి ఈ ఈ , ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఈ, మెడికల్ ఆఫీసర్, ఐసిడిఎస్ సూపర్వైజర్, సర్పంచి కమతం అరుణ కుమారి , ఎంపీటీసీ సత్యవతి శ్రీజ , ఇతర నాయకులు, సచివాలయం సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగనవాడి కార్యకర్తలు మరియు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు పాల్గొని డయేరియా అవేర్నెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.