స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి కాకాణి
తోడేరులో ఓటు వేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, కాకాణి పూజిత
పొదలకూరు, రవి కిరణాలు : జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పొదలకూరు మండలం తోడేరు గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఆయనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న కాకాణి కుటుంబ సభ్యులు, ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేయాల్సిన ప్రాముఖ్యతను చాటిచెప్పారు.

