పొతేగుంట గ్రామంలో స్కూల్‌ విద్యార్థుల తల్లిదండ్రులతో ఎంఆర్పిఎస్, ఎం ఎస్ పి , నాయకులు నిరసన. 

మాబడి మార్చవద్దు మా పిల్లలు మరో బడికి పంపించం అంటున్న తల్లిదండ్రులు 




నెల్లూరు [సైదాపురం], రవికిరణాలు జూలై 18 :

సైదాపురం మండలం పొతేగుంట అరుంధతియవాడ గ్రామంలో, సుమారు 180 కుటుంబాలు ఉన్నప్పటికీ ఆవాడ నుండి దాదాపు 28 మంది విద్యార్థులు ఉండగా మోడల్ స్కూల్ పేరుతో చదువుతున్నటువంటి స్కూల్ నుండి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూలుకి మార్చారని, పిల్లలు తల్లిదండ్రులు ఉదయం ఐదు ఆరు గంటల సమయంలో పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ ఉంటామని మా వాడలో ఉంటేనే స్కూలు ఎవరో ఒకరు మా బంధు వర్గీయులు పిల్లలకు ఏదైనా జరిగితే అందుబాటులో ఉంటున్నారని ఇప్పుడు మా వాడికి స్కూలుకి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు నుండి రెండు కిలోమీటర్ల వరకు ఉంటుందని అంత దూరం పంపించడానికి తల్లిదండ్రులుగా మేము నిరాకరిస్తూ దాదాపు 38 రోజులుగా విద్యకు దూరమైన విద్యార్థులు మా గ్రామంలోని  స్కూలు ఉండాలి వేరే గ్రామంలోని స్కూలుకి వెళ్ళమంటూ విద్యార్థులు నిరసన తెలియజేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు గ్రామంలోని రాజకీయ నాయకులతో చేతులు కలిపి స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ కి విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే   సాధారణ మీటింగ్ లాగే  కొన్ని అంశాలపై చర్చిస్తామని చెప్పిన టీచర్, అసలు విషయం దాసిపెట్టి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర సంతకాలు తీసుకోవడం జరిగిందని పిల్లల తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తపరిచారు. మండల ఎంఈఓ లు మా పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని పిల్లల తల్లిదండ్రులు తెలిపారు. మా గ్రామంలోనే  మా పిల్లలకు విద్యనందించాలని మీడియా ముఖంగా తెలియజేశారు.    ఈ కార్యక్రమంలో మందా వెంకటేశ్వర రావు ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి  జాతీయ నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు, ఎం ఎస్ పి  రాష్ట్ర నాయకులు పంధిటి అంబెడ్కర్ మాదిగ,  ఎం ఎస్ పి  జిల్లా నాయకులు సూరిపాక ఉదయ్ మాదిగ, ఎమ్మార్పీఎస్  జిల్లా అధ్యక్షుడు ఎమ్మార్పీఎస్  నాయకులు గంగాధర్,ఏడుకొండలు,పెంచలయ్య పోతేగుంట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.