పార్కు స్థలాలను పరిశీలించిన కమిషనర్ నందన్ 




నెల్లూరు  [కార్పోరేషన్], రవికిరణాలు సెప్టెంబర్ 06 :

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా శనివారం స్థానిక మాగుంట లేఔట్ ప్రాంతంలోని సైన్స్ పార్క్ స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని భవన నిర్మాణాలను తనిఖీ చేసి అనుమతులను పరిశీలించారు.

అలాగే కమిషనర్ నందన్ స్థానిక మినీ బైపాస్ ప్రాంతంలోని ఎన్టీఆర్ పార్కును  సందర్శించారు. పార్కులోని వసతులు, సందర్శకులకు అందుతున్న సౌకర్యాలను కమిషనర్ పరిశీలించారు. అనంతరం పార్కు పరిసర ప్రాంతాలలో పాదచారుల మార్గాన్ని ఆక్రమిస్తూ ఏర్పాటు చేసిన దుకాణాలను కమిషనర్ తనిఖీ చేశారు. ఈకార్యక్రమంలో హార్టికల్చర్ ఎడి. నరసింహారావు, ఈఈ శేషగిరిరావు,డిఇ రఘురాం, ఎఇ ఫాజిల్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సతిష్, టిపిబిఓ భారత రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.