"స్మార్ట్ స్ట్రీట్ బజార్" ప్రాజెక్టును వేగవంతం చేయండి కమిషనర్ వై.ఓ నందన్
"స్మార్ట్ స్ట్రీట్ బజార్" ప్రాజెక్టును వేగవంతం చేయండి కమిషనర్ వై.ఓ నందన్
రవికిరణాలు జూలై 21 :
వీధి వ్యాపారుల ఆర్థిక అభ్యున్నతి కోసం పైలెట్ ప్రాజెక్టు కింద చేపడుతున్న "స్మార్ట్ స్త్రీట్ బజార్" ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ అధికారులను ఆదేశించారు.
పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక మైపాడు రోడ్డు జాఫర్ సాహెబ్ కెనాల్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసి ఉన్న ఫుడ్ కోర్టులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారాయణ ఆలోచనలతో రూపొందుతున్న స్మార్ట్ స్ట్రీట్ బజార్ పైలెట్ ప్రాజెక్టును అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయనున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్మోహన్ రావు, ఈ.ఈ రహంతు జానీ, డి.ఈ రఘురాం, పాల్గొన్నారు.