కావలి మున్సిపల్ కమిషనర్ జి. శ్రావణ్ కుమార్ ను శానిటరీ ఇన్స్పెక్టర్ ఎండి బషీన్ను అభినందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు.
కావలి మున్సిపల్ కమిషనర్ జి. శ్రావణ్ కుమార్ ను శానిటరీ ఇన్స్పెక్టర్ ఎండి బషీన్ను అభినందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు.
కావలి, రవికిరణాలు జూలై 21 :
రాష్ట్రంలో ఉన్న పురపాలక సంఘాలు అన్నీ కూడా స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో భాగమై ప్రతి మూడవ శనివారం రోజున ఆఫీసు సిబ్బందితో తన కార్యాలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని అలాగే ప్లాస్టిక్ రహిత సమాజంగా నిర్మించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగానే కావలి పట్టణ మున్సిపల్ పరిధిలో ఎక్కడ కూడా అపరిశుభ్రంగా లేకుండా స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో భాగంగా క్లీనర్ గ్రీన్ గా ఉంచేందుకు రాబోవు తరానికి మాదిరిగా ఉండాలని ఉద్దేశంతో కావలి పట్టణాలు ర్యాలీలు నిర్వహించి అవేర్నెస్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే ప్లాస్టిక్ రహిత అవగాహన కార్యక్రమాలను ర్యాలీలను నిర్వహించడం జరిగింది. దీనిపై కావలి పట్టణ మున్సిపాలిటీ కి నారా చంద్రబాబు నాయుడు శానిటి ఇన్స్పెక్టర్ ని తిరుపతిలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర ప్లాస్టిక్ కాలుష్య రహిత అంతం చేసే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఎండి బషీర్ ఇన్స్పెక్టర్ కి అవార్డు ప్రధానం చేశారు. మరియు కావలి మున్సిపల్ కమిషన్ జి. శ్రావణ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు