పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసిన కమిషనర్
పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసిన కమిషనర్
నెల్లూరు [కార్పోరేషన్], రవికిరణాలు సెప్టెంబర్ 06 :
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక జేమ్స్ గార్డెన్, వెంకట్రామాపురం ప్రాంతంలో జరుగుతున్న భవనాల డెమోలిషన్ పనులను శనివారం తనిఖీ చేశారు. భవనాల డెమోలిషన్ సమయంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని పరిసర ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం స్థానిక రామలింగాపురం అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని డ్రైన్ కాలువ నిర్మాణం పనులను ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి కమిషనర్ తనిఖీ చేశారు. నిర్దేశించిన సమయంలోపు ప్రణాళిక బద్ధంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఈఈ శేషగిరిరావు, ఎఇ ఫాజిల్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.