రోడ్డు కు ఇరువైపులా ఉండే షాపు లు తొలగించండి కమిషనర్
రోడ్డు కు ఇరువైపులా ఉండే షాపు లు తొలగించండి కమిషనర్
నెల్లూరు [కార్పోరేషన్], రవికిరణాలు సెప్టెంబర్ 08 :
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రోడ్డు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసి ఉన్న షాపులను సోమవారం పరిశీలించారు. అనుమతులు లేకుండా అక్రమంగా రోడ్డు వెంబడి షాపులను ఏర్పాటు చేయకూడదని, వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భాను శ్రీ నగరపాలక సంస్థ ప్లానింగ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.