దివ్యాంగుల విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ




నెల్లూరు [కలువాయి], రవికిరణాలు జూలై 21 : 

కలువాయి మండలంలోని బివిఎన్ఆర్ జడ్పీహెచ్ఎస్ కలువాయి పాఠశాల నందు దివ్యాంగుల  విద్యార్థులకు ఏ ఎల్ ఐ ఎం సి ఓ ( ఆర్టిఫిసియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)మరియు సమగ్ర శిక్ష వారి తరుపున ఉపకరణాలు మండల విద్యాశాఖ అధికారి2 జి శేషగిరిరావు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్డి అబ్బాస్ అలీ మరియు ప్రత్యేక ఉపాధ్యాయురాలు ప్రసన్న లక్ష్మి చేతుల మీదుగా 

కట్ట రుతుగ్రీసు అనే మానసిక వికలాత్వం కలిగిన బాలికకు ఎం ఆర్ కిట్ 3 ను అందజేశారు. మండల విద్యాశాఖ అధికారి శేషగిరిరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్బాస్ అలీ మాట్లాడుతూ ఈ బోధనోపకరణాలు ఉపయోగించి విద్యార్థులు సులభంగా అభ్యసనను నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఇటువంటి విద్యార్థులను మండలంలో ఎక్కడ ఉన్నా పాఠశాలలో చేర్పించుకోవాలని ఐఈఆర్టీలకు తెలియజేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థాయి కి చేరుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు  చల్ల మల్లికార్జున్ రెడ్డి ,బి,శ్రీనివాసులు , సిఆర్ఎంటి కె మహేష్

ఐ ఈ ఆర్ టి లు భానుప్రియ, విశ్వ మరియు తల్లిదండ్రులుపాల్గొనడం జరిగింది