జనసేనాని అడుగుజాడల్లో నెల్లూరు జనసైనికులు
జనసేనాని అడుగుజాడల్లో నెల్లూరు జనసైనికులు
నెల్లూరు [అర్బన్], రవికిరణాలు సెప్టెంబర్ 06 :
ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని జనసేన ఆధ్వర్యంలో వారి నేత జనసేనాని అడుగుజాడల్లో తాము నడిచే విధంగా ఆయన స్ఫూర్తితో నగరంలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ వనంతోపు, మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ భగత్ సింగ్ కాలనీ, కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్ బీవీ నగర్, వివిధ పాఠశాలలో పనిచేస్తున్న 20 మంది ఉపాధ్యాయులకు శనివారం ఆయా పాఠశాలల విద్యార్థుల చేత నూతన వస్త్రములతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ మరియు గుణుకుల కిషోర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 5వ తేదీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిననా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని రెండు వేల మంది ఉపాధ్యాయులకు వస్త్రములను బడి పిల్లల చేత ఇప్పించి సత్కరించిన స్ఫూర్తితో తాము నెల్లూరు పరిధిలోని వివిధ మున్సిపల్ పాఠశాలలోని ఉపాధ్యాయులకు సన్మానించడం జరిగిందని తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమకు ఇచ్చిన ఈ గౌరవానికి సంతోషం వ్యక్తపరుస్తున్నామని, గురువులను గౌరవించే మన సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుచుటయే కాకుండా, త్రికరణశుద్ధితో ఆ ధర్మాన్ని ఆచరించే పవన్ కళ్యాణ్ మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కావడం గర్వకారణమని పేర్కొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు ఈ సందర్భంగా జనసేనాని కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సయ్యద్ జమీర్, సింగంశెట్టి శ్రీరామ్, ఎటూరి రవి, బత్తిన శ్రీకాంత్, గుర్రం కిషోర్, సుధా మాధవ్, శ్రీపతి రాము, వెంకట్ యాదవ్, రాజేష్ శ్రీకాంత్ వీర మహిళలు వరలక్ష్మి లతా కృష్ణవేణి సుభాషిని కామాక్షి తదితరులు పాల్గొన్నారు.