భారీ వాహనాలతో తరచూ ట్రాఫిక్ కష్టాలు పట్టించుకునే నాధుడే లేరు .




నెల్లూరు [కావలి], రవికిరణాలు సెప్టెంబర్ 06 : 

రోజు రోజుకి కావలి పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు పెరిగి పోతున్నప్పటికీ ట్రాఫిక్ విధి విధానాలు పట్టించుకోకుండా ప్రజలు ద్విచక్ర వాహన దారులు లారీలు ఇష్టానుసారంగా  ప్రవర్తించి నడపడం విశేషం. కావలి ఓబయ్య హాస్పిటల్ రోడ్ లో ఎన్నో ప్రముఖ వైద్యశాలలు, మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతం నిత్యము భారీ వాహనాలతో రద్దీగా తిరుగుతూ ట్రాఫిక్ కి అంతరాయం  కలిగిస్తున్నారు. ఇక్కడ నిరంతరం ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతున్నప్పటికీ దీనిపై సంబంధిత అధికారులు పట్టించుకోవాలని ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అలాగే ఏదైనా ప్రమాదం జరిగి అంబులెన్స్ లో ఈ వైద్యశాల వైపు రావాలంటే ప్రాణాలు పోవాల్సిందే సరైన సమయానికి వైద్యశాలకి అంబులెన్స్ చేర్చే పరిస్థితి లేకపోవడంతో భారీ ప్రాణం నష్టం  జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్కసారి ఉన్నతాధికారులు పర్యవేక్షించి, ఈ ప్రాంతానికి వచ్చే భారీ లారీలు, వాహనాలు రాకుండా అరికట్టేందుకు తగు చర్యలు కూడా తీసుకోవాలని కోరుతున్నారు.