శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక స్థలాన్ని కేటాయించినందుకు సీఎం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినఆర్యవైశ్య వెల్ఫేర్ డైరెక్టర్  తటవర్తి వాసు.




కావలి రవికిరణాలు జూలై 18 :

రాష్ట్ర రాజధాని అమరావతి లో ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు కి అమరావతిలో సమున్నత గౌరవం కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యములు కూటమి సర్కారు మంచి నిర్ణయాన్ని తీసుకుందని దీనికి సి ఆర్ డి ఏ పరిధిలో 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయించి అందులో స్మారక భవనంతో పాటు భావితరాలకు గుర్తిండి పోయేందుకు తీర్చిదిద్దాలని ఒక మంచి ప్రణాళికతో సంబంధిత పత్రాలను మంత్రి పొంగూరు నారాయణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ నుండి రాకేష్ కు అందజేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ వెల్ఫేర్ డైరెక్టర్ తటవర్తి వాసు సీఎం చంద్రబాబు నాయుడుకి మరియు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కావలి ఆర్యవైశ్య నేతలు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు కావలి నియోజకవర్గం లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆర్యవైశ్యులకు ఎంతో అండగా ఉంటూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తూ తమ సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని వాసు తెలిపారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని అధికారికంగా నిర్వహించడం తమ హృదయ వీణను తాకిందన్నారు. త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కావలి నియోజకవర్గం లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తమపై మాతృ ప్రేమ చూపుతూ, తమ పురోభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్ని వర్గాలను అదే దృష్టితో ఆదరిస్తున్నారని తెలిపారు. కృతజ్ఞతగా భవిష్యత్తులో ఆర్యవైశ్య సమాజం వారి వెంట ఉండి అన్ని విధాల బాసటగా నిలుస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ తెలిపారు.