పారిశుద్ధ్య లోపం వల్లన భయాందోళనకు గురవుతున్న ప్రజలు
పారిశుద్ధ్య లోపం వల్లన భయాందోళనకు గురవుతున్న ప్రజలు
నెల్లూరు [సైదాపురం], రవికిరణాలు జూలై 21 :
సైదాపురం మండల లోని చాగణం పంచాయతీ పరిధిలో పారిశుధ్యం లోపించడంతో ఆ కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాలనిలో రోడ్లపైనే మురికినీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మురికి కాలువలో పూడిక తీయకపోవడంతోనే, కాలువ నిండి పారుతున్నట్లుగా స్థానికులు తెలిపారు. ఇది మెయిన్ రోడ్లు మరి దుర్గాతనంగా తయారయ్యి రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని స్థానిక గ్రామ ప్రజలు తెలియజేశారు వర్షం వస్తే మరింత ఇబ్బందిగా తయారవుతుందని కనీసం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం చేశారు. మురికి నీరు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో దుర్గంధం వాసనను భరించలేకపోతున్నామన్నారు. కనీసం బ్లీచింగ్ చేసే పాపాన పోలేదని,ఇక్కడ పారిశుద్ధ్యం లోపించడంతో దోమల సమస్య ఎక్కువగా ఉందన్నారు. ప్రజలు తరచుగా వ్యాధుల బారిన పడుతున్నాగాని, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు.వెంటనే చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని స్థానికులు తమ ఆగ్రహం వ్యక్తపరిచారు