విపిఆర్ నివాసానికి విచ్చేసిన మంత్రి టిజి భరత్ 





నెల్లూరు, రవికిరణాలు జూలై 22 :

నెల్లూరు నగరం మాగుంట లే ఔట్ లోని విపిఆర్ నివాసానికి విచ్చేసిన రాష్ట పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టిజి భరత్ కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఘనస్వాగతం పలికి పుష్ప గుచ్చంతో చిరు సన్మానం చేశారు. 

అనంతరం ఎమ్మల్యే  ఇంట అల్పాహారం స్వీకరించిన మంత్రి భరత్ గారు  ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తో స్థానిక రాజకీయాలు మరియు కోవూరు నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలతలపై చర్చించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ దంపతులు మంత్రి భరత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాలతో సన్మానం చేశారు.