శ్రీ సరస్వతి ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు 






నెల్లూరు  [వింజమూరు], రవికిరణాలు సెప్టెంబర్ 06 : 

వింజమూరులోని శ్రీ సరస్వతి ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలు అంకిరెడ్డి విద్యార్థిని విద్యార్థులు అందరినీ సమావేశపరిచారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకు గురువు లాంటి వారిని పూజనీయులు తత్వవేత్త అయినా ఆయన జన్మదినాన్ని గురుపూజోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం అన్నారు ఆయన 1888 సెప్టెంబర్ 5వ తేదీన తిరుత్తని గ్రామంలో జన్మించారు ఆయన తన విద్యాభ్యాసం చెన్నైలోనే జరిగిందని ఆయనలో ఉన్న తల్లిదండ్రుల పట్ల ప్రేమ అభిమానాలకు ఉదాహరణగ రాధాకృష్ణన్ చదివేటప్పుడు బడి నుంచి ఇంటికి రాగానే తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసి వారి పాదాలను సుశిమెత్తగా నిమిరే వాడని తెలిపారు అదే విధంగా ఆన్లైన్ లో ఉన్న గొప్పతనానికి నిదర్శనంగా తన పుట్టినరోజును వ్యక్తిగతంగా జరుపవద్దని ఉపాధ్యాయులందరికీ అంకితం చేయాలని అందుచేత ప్రతి సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకునే విధంగా నాటి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు ఆనాటి నుండి సెప్టెంబర్ 5వ తేదీనే గురుపూజోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము అని తెలిపారు అదేవిధంగా విద్యార్థులు బరువుల పట్ల గౌరవ భక్తి ప్రపత్తులతో ఉండాలని క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని అలవర్చుకోవాలని అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలమని తెలిపారు గతంలో గురుకులాలకు వెళ్లి చదివే సమయంలో గురువులు ఆశీస్సులను అనేక పరీక్షలకు గురిచేసి తదుపరి తన ఆశ్రమంలో చేర్చుకునే వారిని అలాంటి పరిస్థితి ప్రస్తుతం కార్పొరేట్ పాఠశాలలో ప్రాథమిక పరీక్ష నిర్వహించి చేర్చుకుంటున్నారన్నారు విద్యార్థులు జీవితంలో బంగారు భవిష్యత్తును అనుభవించేందుకు సుశిక్షితమైనశిక్షణను పొంది అత్యున్నత స్థానాలను పొందాలని ఆకాంక్షించారు కావున నేటి విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల గౌరవం కలిగి చదువు పట్ల అంకిత భావంతో నెలకి ఉన్నత శిఖరాలలో ప్రకాశించాలని ఆకాంక్షించారు అయితే ఈ కార్యక్రమ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులుగా ఒక్కరోజు ఉపాధ్యాయులుగా చక్కని బోధనను తన జూనియర్లకు అందించారు వారు పొందిన అనుభూతిని యాజమాన్యంతో ఉపాధ్యాయ బృందంతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో యు వెంకటరెడ్డి ఆర్ వెంకటేశ్వర్ రెడ్డి డి కృష్ణారెడ్డి ఉపాధ్యాయ బృందం షేక్ మహమ్మద్ జానీ బాబా డి శ్రీనివాసులు ఎస్కే షకీలా శ్రీనివాస్ జయరామిరెడ్డి మమత వై శ్రావణి భాను నాగలక్ష్మి తేజస్విని శిరీష రాధ విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు.